Hyderabad:టీజీఆర్టీసీకి సంక్రాంతి బొనంజా

sankranthi movies

సంక్రాంతి పండుగొచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాల సందడి కనిపింస్తుంటుంది. అందులోనూ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల జోరు నడుస్తుంది. కొన్ని సినిమాలు వంద నుంచి 5 వందల కోట్ల బడ్జెట్‌తో తీసి.. వేయి కోట్ల వసూళ్లు రాబడుతుంటే.. మరికొన్ని మాత్రం చిన్న బడ్జెట్‌తో తీసినా వంద కోట్ల క్లబ్‌లో చేరి.. బ్లాక్ బాస్టర్ కొడుతున్నాయి

టీజీఆర్టీసీకి సంక్రాంతి బొనంజా

హైదరాబాద్, జనవరి 20
సంక్రాంతి పండుగొచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాల సందడి కనిపింస్తుంటుంది. అందులోనూ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల జోరు నడుస్తుంది. కొన్ని సినిమాలు వంద నుంచి 5 వందల కోట్ల బడ్జెట్‌తో తీసి.. వేయి కోట్ల వసూళ్లు రాబడుతుంటే.. మరికొన్ని మాత్రం చిన్న బడ్జెట్‌తో తీసినా వంద కోట్ల క్లబ్‌లో చేరి.. బ్లాక్ బాస్టర్ కొడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఈ సంక్రాంతి బరిలో టీజీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ నిలవగా.. టీజీఎస్ ఆర్టీసీ బ్లాక్ బాస్టర్ కొట్టింది. భారీ ఆదాయంతో ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఏపీతో పోలిస్తే.. సుమారు పది రెట్లు అధిక ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలుస్తోంది.సంక్రాంతి పండుగ టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రయాణికుల రద్దీని, గతేడాది అనుభవాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. వీలైనన్ని ఎక్కువగా స్పెషల్ సర్వీసులు నడపటంతో.. బాగానే గిట్టుబాటు అయ్యింది. దీంతో.. ఈసారి టీజీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.112.46 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు. అయితే.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను భారీగా పెంచింది. ఫలితంగా.. ఆదాయం కూడా అదే స్థాయిలో సమకూరినట్టు సమాచారం.2024 సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ 4962 ప్రత్యేక బస్సులను నడపగా.. రూ.98.49 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా.. ఈసారి 5806 ప్రత్యేక బస్సులను నడిపించగా.. ఏకంగా రూ.112.46 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 844 ప్రత్యేక బస్సులను నడిపింటంటో.. మరో రూ.14 కోట్లు ఎక్కువగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.గత ఏడాది సంక్రాంతి 15వ తేదీన రాగా.. 10, 11, 12, 13, 14వ తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉంది. ఈసారి పండుగ 14న రాగా 9, 10, 11, 12, 13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య కూడా భారీగానే పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 6 లక్షల మంది ప్రయాణికులు.. సొంతూళ్లకు వెళ్లినట్లు చెప్తున్నారు. సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ఈ నెల 19, 20 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. 17, 18 తేదీల్లోనూ స్పెషల్ సర్వీసులను నడిపించినప్పటికీ అనుకున్నంత మంది ప్రయాణించలేదని అధికారులు చెప్తున్నారు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపించింది. కానీ.. తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీనే ఎక్కువ బస్సులను కేటాయించడంతో అక్కడి ప్రజలు ఏపీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. టీజీఎస్ ఆర్టీసీకే ఎక్కువ ఆదాయం సమకూరినట్టు సమాచారం.

Read:New Delhi:ఆప్ కు కాంగ్రెస్ టెన్షన్

Related posts

Leave a Comment