ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్దే
-అణగారిన వర్గాలు కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాలే
-మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని
ఆనాడు పటేల్ పట్వారీ దొర బాంచెన్ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శనివారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో మంథనిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచే వారని కనీసం పెద్దవాళ్లను తల ఎత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్టీఆర్దేనని అన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్టీ రామారావు కారణమన్నారు. ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస పార్టీ తమ చెక్కు చేతల్లో ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునే వారని, ఎస్సీల్లో రిజర్వేషన్లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్య క్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్లు కాయితీ సమ్మయ్య, ఆరెపల్లి కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మాచిడి రాజు గౌడ్, నాయకులు మంథని లక్ష్మణ్, గొబ్బురి వంశీ, బండారి శ్రీకాంత్, మైనార్టీ నాయకులు ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.