Hyderabad:హైదరాబాద్ లో బీదర్ గ్యాంగ్

Bidar gang in Hyderabad

హైదరాబాద్ నడిబొడ్డున పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న బీదర్ గ్యాంగ్ కోసం వేట కొనసాగుతోంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు.

హైదరాబాద్ లో బీదర్ గ్యాంగ్..

హైదరాబాద్, జనవరి 18
హైదరాబాద్ నడిబొడ్డున పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న బీదర్ గ్యాంగ్ కోసం వేట కొనసాగుతోంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు. కాల్పులు జరిపిన నిందితులు బోర్డర్ దాటిపోకుండా కట్టడి చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు.బీదర్ పోలీసులపై బీదర్‌కు చెందిన నిందితులు కాల్పులు జరిపారు. బస్‌లో కాల్పులు జరపడంతో సంచలనంగా మారింది. ఇది వేరే రాష్ట్రానికి చందిన వారు అయినప్పటికి హైదరాబాద్‌లో జరగడంతో తెలంగాణ పోలీసులకు ఈ కేసు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. అందుకే బీదర్ పోలీసుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు వారి ఇచ్చిన క్లూస్ ఆధారంగా విచారణ చేపట్టారు. కర్ణాటకలోని బీదర్‌లో ఏటీఎం వాహనంపై కొందరు దుండగులు అటాక్ చేసి నగదు మాయం చేశారు. 93 లక్షలతో ఉడాయించారు. వాళ్ల ఫోన్‌లు ట్రాప్ చేసిన పోలీసులు వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. అందుకే వారిని పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్‌ వచ్చారు. అఫ్జల్‌ గంజ్‌లోని ఓ ట్రైవెల్స్ ఆఫీస్‌ వద్ద పోలీసులను చూసిన దుండగులు కాల్పులు జరిపాడు. బీదర్‌లోని శివాజీ చౌక్‌ మధ్యాహ్నం దోపిడీ జరిగింది. ఓ ఏటిఎంలో నగదు నింపేందుకు డబ్బులు తీసుకొస్తున్న సిబ్బందిపై ఇదే ముఠా కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లింది. అక్కడ ఓ బైక్‌పై పారిపోయారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలా బీదర్‌లో చోరీకి పాల్పడిన దుండగులు బైక్‌పై హైదరాబాద్‌ వచ్చారు. వారి కదలికలను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్న పోలీసులు వారంతా హైదరాబాద్‌లో ఉన్నట్టు తేల్చారు. తీరా వాళ్లు వచ్చి గాలింపు చర్యలు చేపడుతుంటే వారిపైనే కాల్పులు జరిపి రెండు రాష్ట్రాల పోలీసులకకు మోస్ట్ వాటెండ్‌గా మారిపోయారు. ఇదే విషయాన్ని బీదర్ పోలీసుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు అణువణువూ గాలిస్తున్నారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ నిందితుల కోసం ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు బృందాలు ఫామ్ చేసినట్టు వెల్లడించారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని గాలిస్తున్నామని అన్నారు.ఆయుధాలు అక్రమంగా అమ్మే వ్యక్తిని పట్టుకొని 24 గంటలు గడవక ముందే ఇలా కాల్పులు జరగడం పోలీసులు హై అలర్ట్ అయ్యారు. బుధవారం నేరేడ్‌మెట్‌ రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేకృష్ణ యాదవ్‌ అనే పాతికేళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు. రాంపూర్‌ బోహలో ఉండే ఈ వ్యక్తి ఆరేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ సంపాదన ఖర్చులకు సరిపోవడం లేదని మళ్లీ ఊరెళ్లిపోయాడు. అక్కడే ఆయుధాలు విక్రయించే గ్యాంగ్‌తో చేతులు కలిపాడు. షాపూర్‌ గ్రామానికి చెందిన సంపత్‌యాదవ్‌ వద్ద రూ.20వేలకు .32ఎం.ఎం, ఒక తపంచా, 10 బుల్లెట్లు కొన్నాడు. వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. విషయాన్ని గ్రహించిన పోలీసులు అరెస్టు చేశారు. ఇది జరిగిన 24 గంటల్లోనే కాల్పులు పోలీసులను పరుగులు పెట్టించాయి.

Read:Hyderabad:క్యాబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన

Related posts

Leave a Comment