Tirupati:బలమైన మిత్రబంధమేనా

babu-pawan

రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే..గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ కాకపోయిన..ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు, పవన్ ప్లాన్‌గా తెలుస్తోంది.

బలమైన మిత్రబంధమేనా..

తిరుపతి, జనవరి 18
రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే..గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ కాకపోయిన..ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు, పవన్ ప్లాన్‌గా తెలుస్తోంది. సేమ్‌టైమ్‌ కూటమిగా గెలిచారు..ఎన్నాళ్లు కలిసి ఉంటారు.? మిత్రబంధం ఎప్పటిదాకా.? అన్న ప్రశ్నలకు కూడా తమ కామెంట్స్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నారు టీడీపీ, జనసేన అధినేతలు. పొత్తు ఉంటుంది.. క్షేత్రస్థాయిలో టీడీపీ-బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి నడవాల్సిందేనని ఇండికేషన్ ఇస్తున్నారు.మరో 15 ఏళ్లు పొత్తు ఉంటుందని అని పవన్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయ్యేదెప్పుడు అనేది పెద్ద క్వశ్చన్‌గా మారింది. పవన్‌ మాత్రం పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్నారు. ఈ టర్మ్‌లోనే రెండున్నరేళ్లు సీఎం పదవి అడగాలని కొందరు సూచించినా అలాంటి షరతులు ఏం పెట్టలేదు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమిగానే రంగంలోకి దిగుతాం. మొన్న గెలిచామని లైట్‌ తీసుకోవడం లేదు.. ఇంకో పదిహేనేళ్లు టీడీపీతోనే దోస్తీ అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్. కలిసి కదం తొక్కి మొన్నే సత్తా చాటాం..రాబోయే రోజుల్లోనూ కలిసే నడుస్తాం..నవ్యాంధ్రను ఒక్కో మెట్టుపైకి ఎక్కిస్తామంటూ..కూటమి ఫ్యూచర్‌పై అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్‌ ఫుల్ క్లారిటీతో ఉన్నారు.మ‌రో ప‌దిహేనేళ్లు కలిసే ఉండాల‌ని భావిస్తున్నాం. రెండు రోజుల నుంచి డిప్యూటీ సీఎం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలివి. గతంలోనూ కూటమిగానే ముందుకెళ్తామని చెప్పారు పవన్. ఇప్పుడు మ‌రింత గ‌ట్టిగా త‌న వాద‌న‌ను వినిపిస్తున్నారు. గ‌తేడాది జరిగిన ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పొత్తు పెట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ కూట‌మి నేతల మ‌ధ్య అక్కడక్కడ విభేదాలు వచ్చాయి. నియోజకవర్గాల్లో మూడు పార్టీల లీడర్లకు కోఆర్డినేషన్‌ మిస్‌ అవడంతో పాటు వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికల విషయం లోనూ కాస్త గ్యాప్ ఏర్పడింది.

అనంత‌పురంలో బీజేపీ వ‌ర్సెస్ టీడీపీ, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ఇలా ప‌లు జిల్లాల్లో కూటమి నేతల మధ్య గొడవలు రాజ‌కీయంగా ఉద్రిక్తత‌ల‌కు దారితీశాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో పొత్తు ఉంటుందని కుండ బద్దలుకొట్టి చెప్తున్నారు పవన్. అయితే నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతల సఖ్యత కుదరకపోవడంతో పొత్తు కష్టమేనన్న వాదనలు వినిపించాయి. అయినా ఎక్కడా కూడా గాడి త‌ప్పకుండా పొత్తు ర‌థం ప‌దిలంగా ముందుకు సాగింది.అయితే పొత్తు విషయంలో బాబు కంటే ముందే పవన్‌ క్లారిటీతో ఉన్నారు. పలుమార్లు సేనాని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఇంకో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని ఆ మధ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్. బాబు దూరదృష్టితో ఏపీ మరింత డెవలప్ అవుతుందని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత కూటమి ఫ్యూచర్‌పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అయ్యాయి. జమిలి ఎన్నికలు వచ్చినా..2029లో ఎలక్షన్స్‌ జరిగినా కలిసే పోటీ చేస్తాం.. ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవతున్నామంటూ బాబు చెప్పడం హాట్ టాపిక్ అయింది. అధికారంలోకి వచ్చాం..అవసరమైపోయిందని కాకుండా..కలసి నడిస్తే పార్టీలకు, ప్రజలకు జరిగే మేలోంటి తెలిసిన నాయకులుగా అటు చంద్రబాబు, ఇటు పవన్ బిహేవ్ చేస్తున్నారు.ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి. ఇందులో ఒక్క టీడీపీకి మాత్రమే గెలుపును సొంతం చేసుకునేంత ఓటు బ్యాంకు ఉంది.

జనసేనకు పవన్ ఇమేజ్‌, క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సొంతంగా గెలిచేంత బలం లేదు. అలా అని కీలకం కాదని చెప్పలేం. ఏపీలో గెలుపోటములను డిసైడ్‌ చేసేంత సత్తా మాత్రం జనసేకు ఉంది. ఇక బీజేపీ అయితే కూటమితోనే అన్నో ఇన్నో సీట్లు సంపాదిస్తూ వస్తోంది. సో ఈ నేపథ్యంలో అధికారంలో ఉండాలని కోరుకునే ఈ మూడు పార్టీలు..కలిసి పోటీ చేస్తేనే పవర్ స్టీరింగ్‌ను పట్టుకోగలవన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.పొత్తుపై ముందే అలర్ట్‌ అవడం వెనుక ఇంకో స్ట్రాలజీ ఉందట. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అంతో ఇంతో ప్రజావ్యతిరేకత కామన్. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉండే ఆ ఓటు షేర్‌ మీదే గెలుపోటములు డిపెండ్‌ అయి ఉంటాయ్‌. అందుకే ఎవరిదారి వారిదే అని కాకుండా..లాంగ్‌ లివ్‌ కూటమి అంటున్నారు బాబు, పవన్.రాష్ట్రంలో జనసేన, బీజేపీ కంటే టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువ. ఆ పార్టీనే బూత్‌ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ తర్వాత ప్రతీ ఊర్లో పవన్‌కు అభిమానులు ఉంటారు. అంత పటిష్టంగా ఉండి కూటమిని లీడ్‌ చేస్తున్న టీడీపీ, జనసేన అధినేతలే పొత్తు ఉంటుందని పదేపదే చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు కనిపిస్తోంది.రాబోయే రోజుల్లో కూడా కలిసి నడుస్తామంటే పవన్‌ సీఎం పదవి ఆశలు వదులుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. లేక కూటమిగా పోటీ చేస్తేనే గెలుపు సాధ్యమని భావిస్తున్నారా.? టీడీపీకి అండగా నిలిచి..వాళ్ల మద్దతుతోనే సీఎం పదవిలో కూర్చోవాలని స్కెచ్‌ వేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కామెంట్స్ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

Read:Kakinada:కోడిపందేలు.. సామాన్యులపై కేసులు ఇదెక్కడి చోద్యం

Related posts

Leave a Comment