Guntur:కృష్ణా ముంపునకు శాశ్వత పరిష్కారం

Tadepalli area of ​​Guntur district will get permanent relief from Krishna floods.

గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి కృష్ణా వరదల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. ఇప్పటికే విజయవాడ వైపు కృష్ణా నది పరవళ్లు పేదల ఇళ్లను ముంపు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగ్గా ఇప్పుడు నదికి కుడి గట్టున గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామ పరిధిలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు.

కృష్ణా ముంపునకు శాశ్వత పరిష్కారం..

గుంటూరు, జనవరి 18
గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతానికి కృష్ణా వరదల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. ఇప్పటికే విజయవాడ వైపు కృష్ణా నది పరవళ్లు పేదల ఇళ్లను ముంపు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగ్గా ఇప్పుడు నదికి కుడి గట్టున గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లి గ్రామ పరిధిలో కూడా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూర్తైన తర్వాత కృష్ణా నదికి వచ్చే వరదలు జనావాసాలను ముంచెత్తకుండా నాలుగైదు దశాబ్దాల క్రితమే బ్యారేజీ ఎగువన, దిగువన కరకట్టల్ని నిర్మించారు. కాలక్రమంలో ఇరిగేషన్ శాఖ నిర్వహణ లోపంతో కట్టలకు దిగువున వ్యవసాయానికి పరిమితం కావాల్సిన భూభాగాల్లో నివాసాలు వెలిశాయి.ప్రభుత్వాలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ వచ్చాయి. గత యాభై ఏళ్లుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలా వేల సంఖ్యలో నదీ తీర భూముల్లో ఇళ్ల నిర్మాణం జరిగింది. లక్షల్లో జనావాసాలు వెలిశాయి. వాటిని తొలగించడం సాధ్యం కాని స్థితికి పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగరం వైపు మొదట రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు.2014లో టీడీపీ ప్రభుత్వ హయంలో యనమలకుదురు ప్రాంతంలో మొదట రిటైనింగ్ వాల్ నిర్మాణం మొదలైంది. 2019-24 మధ్య కృష్ణలంక నుంచి యనమల కుదురు వరకు శాశ్వతంగా గోడ నిర్మాణం చేపట్టారు. విజయవాడ వైపు కృష్ణా వరదల నుంచి కొంత మేరకు విముక్తి లభించింది.విజయవాడ వద్ద కృష్ణా నది ఎడమవైపు మార్జిన్ లో వరద రక్షణ గోడను నిర్మించడం వల్ల గత ఏడాది సెప్టెంబరులో కృష్ణా నది వరద సమయంలో 11.43 లక్షల క్యూసిక్కుల వరద ప్రవాహం వచ్చినప్పటికీ కృష్ణ లంక, రాణీగారి తోట తదితర పల్లపు ప్రాంతాలు ముంపుకు గురికాలేదు. ఇప్పుడు తాడేపల్లి వైపు కూడా రిటైనింగ్‌ నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

కృష్ణా కుడిగట్టు భాగం మంగళగిరి నియోజక వర్గంలోకి వస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంగళగిరిలో వైసీపీ ప్రాతినిథ్యం వహించేది. విజయవాడలో గోడ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే స్థానికులు తాడేపల్లి వైపు కూడా గోడ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో 2020-24 మధ్య కాలంలో కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో తాడేపల్లిలోని సుందరయ్య నగర్, సీతానగరం ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గత ఏడాది కృష్ణా నదికి వరదలు ముంచెత్తిన సమయంలో ఈ ప్రాంతాలు రోజుల తరబడి ముంపులో ఉండాల్సి వచ్చింది. దీంతో స్థానికులు మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేయడంతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి.ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదికి కుడి మార్జిన్‌ లో 0.9 KM నుండి 2.61 KM వరకు వరద రక్షణ గోడ నిర్మాణ పనులకు రూ.294.20 కోట్లతో పరిపాలన అనుమతి మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కృష్ణా నది కుడివైపు మార్జిన్ లో ప్రకాశం బ్యారేజ్ దిగువన కూడా శాశ్వత ప్రాతిపదికన వరద రక్షణ గోడను నిర్మిస్తారు. తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీ తదితర పల్లపు ప్రాంతాల ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ వరద రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Read:Visakhapatnam:స్టీల్ ప్లాంట్ కు ప్రాణం

 

 

Related posts

Leave a Comment