ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు.
కేటీఆర్ కు మరో తలనొప్పి
హైదరాబాద్, జనవరి 17
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు కేసులో కీలకంగా ఉన్న ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించారు. తర్వాత వైదొలగింది. అందుకే ప్రభుత్వం నుంచి స్పాన్సర్ షిప్ ను చెల్లించాల్సి వచ్చింది. ఏస్ నెక్స్ట్ జెన్ తో పాటు గ్రీన్ కో ఎండీ అనిల్ చలమలశెట్టికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 18న విచారణకు కావాలని నోటీసుల్లో పేర్కొంది.ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ సహా అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. ఇప్పుడు అనిల్ చలమలశెట్టికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ఏసీబీ దర్యాప్తు దూకుడుగా జరుపుతోంది. గ్రీన్ కో కంపెనీకి ఏస్ నెక్స్ట్ జెన్ సబ్సిడరీ కంపెనీ. ఇప్పటికే ఈ కేసులో ఆ సంస్థల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కంపెనీ ఏర్పాటు వెనుక ఉద్దేశాలు..స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడం అదే సమయంలో బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వడం తదితర అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. త్వరలో కేటీఆర్ కు కూడా మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈడీ విచారణ తర్వాత ఏసీబీ అధికారులు కేటీఆర్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ను అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సమక్షంలో విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘ సర్వీస్ ఉన్న తాను.. నిబంధనలకు విరుద్దంగా ఏమీ చేయలేదని అంతా కేటీఆర్ చెప్పినట్లుగానే చేశానని.. చెబుతున్నారు. అదే క్రమంలో జరిగిన వివరాలన్నీ చెబుతానని తనను అరెస్టు చేయవద్దని ఆయ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో డబ్బులు చెల్లించక ముందు ఎలాంటి ఒప్పందం లేదు. డబ్బులు చెల్లించిన తర్వాతనే ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏస్ నెక్ట్స్ జెన్ స్పాన్సర్ షిప్ ఉపసంహరించుకోవడం కూడా కుట్రపూరితం అన్న అనుమానాలు రావడంతో ఆ దిశగా కూడా ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించడంతో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే ఈ వ్యవహారంలో అందర్నీ పూర్తి స్థాయిలో ప్రస్నించిన తర్వాతనే అరెస్టుల గురించి ఏసీబీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
Read:Nalgonda:కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఎలా అంటే