Mylavaram:టీడీపీకి కార్యకర్తలే బలం,బలగం

tdp-creates-history-b-y-crossing-one-crore-memberships

కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు.
టీడీపీకి కార్యకర్తలే బలం, బలగం.
ప్రాణసమానమైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మైలవరం నియోజకవర్గంలో 66,369 సభ్యత్వాల నమోదు.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు

మైలవరం
టీడీపీ కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చరిత్ర సృష్టించారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించినప్పుడు ఒక్కరితో ఆరంభమైన ప్రయాణం నేడు కోటి మందికి పైగా కుటుంబ సభ్యులతో వర్ధిల్లుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 52 వేల 598 సభ్యత్వములు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో కూడా 66,369 మంది సభ్యత్వములు నమోదు చేసుకున్నారని అన్నారు. లైఫ్ టైమ్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. సభ్యత్వ నమోదును ప్రతి గ్రామంలో ఒక ఉత్సవంలా నిర్వహించారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారన్నారు.ముఖ్యంగా ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందన్నారు. అలానే ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తుందన్నారు.కార్యకర్తల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంతోషం కోసం సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం నిర్విరామంగా శ్రమిస్తుందోన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శాసనసభ్యులు కృష్ణప్రసాదు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Read:Visakhapatnam:చిక్కడు..దొరకడు

Related posts

Leave a Comment