గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
తెలంగాణకు అతిమర్యాద,,,
రాజమండ్రి, జనవరి 17
గోదావరి జిల్లాలు అంటే మర్యాదలకు పెట్టింది పేరు. అందులోనూ సంక్రాంతి అల్లుడికి వారు చేసే మర్యాదల గురించి తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం శృతి మించుతున్న ఆనవాళ్లు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ” అతి ” మర్యాదల ట్రెండ్ తెలంగాణకు సైతం పాకుతున్నాయి తెలంగాణ అమ్మాయిని చేసుకున్న కాకినాడ అబ్బాయి పండక్కి హైదరాబాద్ వచ్చాడని అత్తింటి వారు 130 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు గోదావరి జిల్లాల్లో చూస్తాం. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ తెలంగాణ కూడా పాకింది. సంగారెడ్డి లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రానున్న రోజుల్లో ఇది మరింత గా పెరిగే ఛాన్స్ లేకపోలేదు యానాం కు చెందిన ఒక వ్యాపారి తన అల్లుడికి 465 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించిన సంఘటన కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్ని టీవీ ఛానళ్లు, పేపర్లు దీని గురించి రాశాయి.దీన్ని చూసి ఆ కోవలో మరి కొంతమంది రెడీ అవుతున్నారు.అల్లుడికి ఇలాంటి మర్యాదలు చేయడం తప్పా అంటే కొంచెం లోతుగా మాట్లాడుకుంటే కొన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. నిజానికి ఈ ట్రెండ్ ఒక అయిదారేళ్ళ క్రితం మొదలైంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్ ఛానెళ్లు ఊపు అందుకుంటున్న టైంలో యానాం, ధవళేశ్వరం ప్రాంతాల్లో కొత్తఅల్లుడి కి జరిగిన మర్యాదలపై ఎక్కువ ప్రచారం జరిగింది. అక్కడి నుంచి మొదలై ప్రతి ఏడూ ఇది ఒక ట్రెండ్ లా మారింది. ఒకళ్ళని చూసి మరొకళ్ళు వందల వెరైటీలతో అల్లుడికి భోజనాలు వడ్డించడం, ఊరేగింపులు జరిపించడం ఆనవాయితీ అయిపోయింది. దీనివల్ల మార్కెట్లోకి డబ్బు పంపిణీ జరుగడం అనేది ఒక పాజిటివ్ అంశం కావచ్చు.పిండివంటల రూపంలో, స్వీట్ షాపులకు, మేళ తాళాలకు డబ్బు డైరెక్ట్ గా పంపిణీ అవ్వడం వాళ్లకు ఉపయోగపడుతోంది. కానీ ఈ మర్యాదలు చేస్తున్న వారి ఆర్థిక స్థితి ఏంటి అనేది కూడా ముఖ్యం. సంపన్న అత్తమామలు చేసే ఈ అతి మర్యాదల ట్రెండ్ ఇప్పుడు ఎగువ మధ్య తరగతి, మధ్యతరగతి వర్గాలకు కూడా పాకుతోంది. దీనికోసం అప్పులు చేసి మరి అల్లుడి మర్యాదల కోసం, సొసైటీలో ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎక్కువవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతాం, ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటారనే భ్రమలో అప్పుల పాలు అవుతున్న అత్త మామలు లేకపోలేదు. ఇప్పుడు నెమ్మదిగా తెలంగాణకు కూడా ఈ వైఖరి వెళ్ళిపోయింది. రానున్న రోజుల్లో అక్కడ మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని పరిస్థితులు గమనిస్తున్న వాళ్ళు అంటున్నారు. అల్లుడు మంచోడు అయితే సరే.. లేకుంటే అతని గొంతెమ్మ కోరికలకు ఇబ్బందులు పడే మధ్యతరగతి అత్తా మామల కథలు చాలానే విన్నాం.ప్రస్తుతానికి సరదాగే ఉన్న ఈ “అతి ” మర్యాదల ట్రెండ్ పై మిడిల్ క్లాస్ సరైన దృష్టి పెట్టకపోతే ఇదొక బ్యాడ్ ట్రెడిషనల్ గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. అల్లుడి తో సరదాగా గడిపామా లేదా, అమ్మాయి అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నారు అనే దానిపై పెట్టాల్సిన దృష్టి ఈ “అతి ” మర్యాదలపై పెట్టడం అంత సరికాదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈమధ్య. కాబట్టి మిడిల్ క్లాస్ “అత్తామామలూ “.. జరభద్రం.
8 అడుగుల విస్తరాకులో భోజనం. గోదారోళ్లంటే ఏటకారం తర్వాత గుర్తొచ్చేది ఆతిథ్యం. ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారమంతా భోజనం చేశారు. అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. గోదారోళ్లు మామూలోళ్లుకాదు. ప్రత్యేకత వారిసొంతం. ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారమంతా భోజనం చేశారు. గోదారోళ్లంటే ఆప్యాయతలు, పలకరింపులు మనకు గుర్తుకొస్తాయి. అంతేకాదు గోదారోళ్లు భోజనం పెట్టి చంపేస్తారని నానుడి ఉంది. మామూలుగానే భారీ స్థాయిలో భోజనాలు పెడతారు. మరి సంక్రాంతి లాంటి పండుగ సమయంలో అయితే, ఇంకా వెనకడుగు వేయరుఅందులో భాగంగానే ఈ సంక్రాంతి పండుగకు కూడా కొత్త అల్లుళ్లకు 400 నుంచి 600 వరకు వెరైటీలతో విందులు ఏర్పాటు చేసి కొన్ని కుటుంబాలు వార్తాల్లోకి ఎక్కారు. మరోవైపు ఒకే భారీ విస్తరాకులో కుటుంబం మొత్తం భోజనం చేసి ప్రత్యేకంగా నిలిచారు. ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివార సంక్రాంతి పండుగ సందర్భంగా భోజనం చేశారు.సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. పందెం కోళ్లు ఒకవైపు, గుండాటలు, పేకాటలు వంటి జూద క్రీడలు మరోవైపు జోరుగా జరుగుతుంటాయి. అదంతా ఒక ఎత్తయితే సంక్రాంతికి మర్యాదలు చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత చాటుతారు.అదే విధంగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన సియాదుల సోమేశ్వరరావు, సీతారత్నం ఇంట్లో ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడి సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల విస్తరాకులో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో వినూత్నంగా ఇంట్లోనే వండి భోజనం ఏర్పాటు చేశారు.ముందుగా అల్లుళ్లకు వడ్డించి ఎనిమిది అడుగుల ఏకరీతి విస్తరాకుపై కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. అల్లుళ్ళు, కూతుళ్లు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్లు ఒకే ఆకుపై ఒకరికొకరు తినిపించుకుంటూ ఆప్యాయతల మధ్య చక్కటి విందు ఆరగించారు. రసాయనాల రంగులతో రెడీమేడ్ ప్లేట్లు వాడుతున్న ఈ కాలంలో అతిపెద్ద విస్తరాకులో వడ్డించి తమ ప్రత్యేకతను చాటారు. సంక్రాంతి అంటే అందరూ కలవడం, సరదాగా గడపడం అని చాటి చెప్పారు.
Read:Andhra Pradesh:మార్చిలో నాగబాబుకు పదవీ యోగం