నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు తెలిపారు.
నల్గోండ జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ కోసం 270 ఏకరాలు గుర్తింపు
నల్గోండ
నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కు తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలుగా తీర్చిదిద్దేందుకు, వారికి ఆర్థిక సాధికారతను కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే .ఇందులో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు సుమారు 1000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గత నవంబర్లో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖలు ఎంఓయు సైతం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఒక్కో మెగావాట్ కు 4 ఎకరాల చొప్పున ప్రతి జిల్లాలో కనీసం 100 నుండి 150 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఇదివరకే ఆదేశించింది.
ఈ విషయమై బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖా,రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ, ట్రాన్స్కో, తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాల వారీగా గుర్తించిన భూముల వివరాలు, తీసుకున్న చర్యలపై ఉప ముఖ్యమంత్రి కోరిన సందర్భంలో నల్గొండ జిల్లా వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా 11 సైట్లలో 270 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఇదివరకే రెవెన్యూ, ఫారెస్ట్ ఇతర అధికారుల ఉమ్మడి తనిఖీ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. మరోసారి ఆదివారంలోగా తనిఖీ నిర్వహించి ఆ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదికను సమర్పిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి లోపు గుర్తించిన భూముల ఉమ్మడి తనిఖీ, మ్యాచింగ్, బ్యాచింగ్ సైతాన్ని పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను చురుకుగా అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తిని చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల మహిళలకు ఆర్థికపరమైన సాధికారత లభిస్తుందన్నారు. ఇందుకుగాను అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్లు తక్షణమే సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి గుర్తింపుతో పాటు ,ఆర్థికపరమైన చేయూతకు బ్యాంకు అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, గుర్తించిన భూములలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించి ఆ భూములలో పవర్ ప్లాంట్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల ఎకరాలకు గాను ఇప్పటివరకు సుమారు 890 ఎకరాలు గుర్తించడం జరిగిందని, తక్షణమే తక్కిన భూములు గుర్తించాలని, ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలను త్వరితగతిన అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. అటవీ భూములలో విద్యుదీకరణ కష్టం కాబట్టి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే గిరిజనులు పండించుకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. అటవీ గిరిజన సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా అటవీ భూముల్లో భూమి అభివృద్ధి, గిరిజనులకు ఆదాయం వచ్చే కార్యక్రమాలను చేపట్టాలని, వీటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని త్వరితగతన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ఏర్పాటుకు అన్ని జిల్లాల్లో 5 ఎకరాల లోపు స్థలాన్ని గుర్తించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రస్థాయి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్, సెర్ప్ సీఈవో దివ్య ,సీఎం కార్యదర్శి, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ హాజరుకాగా, జిల్లా నుండి జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ ఈ వెంకటేశ్వర్లు, రెడ్ కో జిల్లా మేనేజర్ ఎం. పాండురంగారావు తదితరులు హాజరయ్యారు.
Read:Nalgonda:నల్గోండ వర్శిటీలో గొడ్డు కారంతో లంచ్ విద్యార్థునుల ఆందోళనలతో మార్పు