Uttarakhand : ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు.

Collapsing hills in Uttarakhand

ఉత్తరాఖండ్‌ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉత్తరాఖండ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు.

ఉత్తరాఖండ్‌ ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై ఉన్న పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విరిగిపడుతున్న రాళ్ల భాగాలు, మట్టితో ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణం నెలకొంది. ఈ రహదారి చైనా సరిహద్దును కలుపుతుంది. ఉవ్వెతున ఎగిసిపడుతున్నట్లుగా కొండలో ఒక వైపు భాగం నుంచి కొంత విరిగిపడడం మనం చూడొచ్చు. ఇలాంటి ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే.. భారీ కొండచరియ విరిగిపడుతున్నప్పుడు కొందరు ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న BRO బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ధార్చుల గుంజి హైవే నుంచి BRO బృందాలు చెత్తను తొలగించే పని నిమగ్నమై ఉన్నాయి.

Read:Trump: ట్రంప్ ప్రమాణానికి జిన్ పింగ్.

Related posts

Leave a Comment