Journalists:డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు.

Demands of digital journalists

డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల లాంటి కనీస హక్కులను డిజిటల్ జర్నలిస్టులను దూరం పెడుతున్నారని ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందర్ భాను ల అధ్యక్షతన డిజిటల్ చానల్స్ జర్నలిస్ట్ మీట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని డిజిటల్ చానల్స్ సీఈవోలు జర్నలిస్టులు పాల్గొని మన సమస్యలపై హక్కుల కోసం గొంతు కలుపుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.

డిజిటల్ చానల్స్ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు ఆగాలంటే డిజిటల్ జర్నలిస్టులు ఏకం కావాలి.

హైదరాబాద్ :
డిజిటల్ చానల్స్ స్వసంత్ర గొంతు లపై దాడులు అక్రమ కేసులు పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి అందవలసిన అక్డేషన్లు హెల్త్ కార్డులు ఇంటి స్థలాల లాంటి కనీస హక్కులను డిజిటల్ జర్నలిస్టులను దూరం పెడుతున్నారని ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుందర్ భాను ల అధ్యక్షతన డిజిటల్ చానల్స్ జర్నలిస్ట్ మీట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని డిజిటల్ చానల్స్ సీఈవోలు జర్నలిస్టులు పాల్గొని మన సమస్యలపై హక్కుల కోసం గొంతు కలుపుదామని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు.

డిజిటల్ జర్నలిస్టుల డిమాండ్లు..

డిస్టాల్ మీడియా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రక్షణ కల్పించాలని న్యూస్ అనాలసిస్ అందిస్తున్న డిజిటల్ చానల్స్ ఈ పేపర్స్ ను మీడియా గా గుర్తించాలని డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ప్రకటనలు డిజిటల్ మీడియాకు కూడా ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్ అక్రిడేషన్ జీవోను సవరించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిజిటల్ చానల్స్ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ..

డిజిటల్ జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దాడులకు కేసులకు గురైన వారికి లీగల్ సర్వీలు అందించాలని దీనికోసం లీగల్ టీం ను ఏర్పాటు చేసుకోవాలని స్కిల్స్ టెక్నాలజీ వర్క్ షాపులు నిర్వహించుకోవాలని డిజిటల్ చానల్స్ కు వస్తున్న థర్డ్ పార్టీ క్లెయిమ్స్ మానిటైజేషన్ ఫై అవగాహన కల్పించాలని దానికోసం సహరించి కోవాలని చానల్స్ స్వతంత్రతను కాపాడుకోవాలని ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది అనంతరం డిజిటల్ చానల్స్ మరియు జర్నలిస్టుల నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలిండియా వెబ్ ఛానల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ .ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే తిరుపతిరెడ్డి. వివిధ డిజిటల్ న్యూస్ ఛానల్ సీఈఓ లు జర్నలిస్టులు దాదాపు 50 డిజిటల్ చానల్స్ ప్రతినిధులు తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

Read:Nara Devansh : నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు.

Related posts

Leave a Comment