Ktr : భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి కేటీఆర్.

Bharat Ratna

ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్ లో పివికి నివాళులర్పించారు.

భారతరత్న పీవీ, తెలంగాణ ఠీవి
కేటీఆర్

హైదరాబాద్
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్ లో పివికి నివాళులర్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు ని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. నెక్లెస్ రోడ్కి పీవీ మార్గ్ అని పేరు పెట్టింది.. పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టింది. అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపింది. పీవీ గారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించింది. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులని అన్నారు.

Read : Hyderabad : కళింగ భవన్ లో జాతీయ చేనేత పట్టు వ స్త్ర ప్రదర్శన.

Related posts

Leave a Comment