హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిబంధనల్ని తుంగలో తొగ్గి కోట్ల రూపాయల ఖర్చుతో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై కేసు, విచారణకు గవర్నర్ జిష్టు దేవ్ శర్మ అనుమతి మంజూరు చేశారు. దాంతో.. ఈ కేసులో ఇప్పటికే అన్ని వివరాలు దగ్గర పెట్టుకుని కాచుకుని కూర్చున్న ఏసీబీ.. వెంటనే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-కేటీఆర్ అరెస్ట్ కు లైన్ క్లియర్
హైదరాబాద్, డిసెంబర్ 17, (న్యూస్ పల్స్)
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిబంధనల్ని తుంగలో తొగ్గి కోట్ల రూపాయల ఖర్చుతో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మాజీ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై కేసు, విచారణకు గవర్నర్ జిష్టు దేవ్ శర్మ అనుమతి మంజూరు చేశారు. దాంతో.. ఈ కేసులో ఇప్పటికే అన్ని వివరాలు దగ్గర పెట్టుకుని కాచుకుని కూర్చున్న ఏసీబీ.. వెంటనే రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ -కార్ రేసింగ్ లో కీలక సూత్రధారిగా ఉన్న కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో.. మరోమారు తెలంగాణలో రాజకీయ రగడ మొదలుకానుంది.రాష్ట్ర గవర్నర్ అనుమతితో ఇక అధికారులు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్ రేసులో ఏసీబీకి ఈ రాత్రికి నివేదిక చేరనుండగా.. ముందుగా ఎవరిని విచారణకు పిలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. గత కొన్నాళ్లుగా బాంబు పేలుస్తాముంటూ సంకేతాలు ఇస్తున్న మంత్రి పొంగులేటి ఈ కేసు విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. గవర్నర్ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఇక విచారణను ప్రారంభించనుంది. మొదట కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌లో భారీ స్కాం జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయని విచారణలో బయటపడింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు తేలింది.ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే గత ప్రభుత్వం చెల్లింపులు చేసిందని… నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధులు మళ్లింపులు జరిగాయి. ఫార్ములా ఈ రేసింగ్‌లో అడ్డగోలుగా వ్యవహారం జరిగిందని రేవంత్ సర్కార్ గుర్తించింది.
దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఏసీబీకి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. 2023లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేసింగ్ నిర్వహించింది. అందుకోసం విదేశీ సంస్థతో ఒప్పందం కేసీఆర్ సర్కార్ కుదుర్చుకుంది. ట్యాంక్ బండ్ చుట్టూ మూడు కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించ లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఎమ్ఏయూడీ నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిగాయి.ఈ కార్ రేసింగ్ లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన పొంగులేటి.. అందుకు ప్రతిఫలం ఎలక్షన్ సమయంలో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. 18 రోజుల వ్యవధిలో విదేశీ మారకం చెల్లించారని ఆరోపించారు.రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకునిపోతుందని.. బాంబు అనేది ఉంటేనే కదా పేలేది అంటూ వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయని వారికి ఉలుకెందుకు అన్న మంత్రి.. అర్థరాత్రి దిల్లీ వెళ్లి ప్రదక్షిణలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.ఈ కేసులో అధికారుల పాత్రపైనా రేవంత్ సర్కార్ సీరియస్ గా ఉంది. ముఖ్యంగా.. ఐఏఎస్ అరవింద్ ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేసినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో.. ఈ కార్ కేసు ఆయన మెడకు చుట్టుకున్నట్లే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే.. అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు.. ఏసీబీ చర్యలు ఏ తీరుగా ఉండనున్నాయో తెలుసుకోవడమే తరువాయి.ఈ స్కాం విషయంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవడం ఖాయమే కానీ ఉన్న పళంగా ఆయనను అరెస్టు చేసే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మొదట ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించిన తర్వాత సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు అనిపించుకోకుండా.. చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read : బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది