సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. 73 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడం రికార్డు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారాధ్యంలో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభమైంది.
-
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది.
-
73 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు
విజయవాడ, డిసెంబర్ 16, (న్యూస్ పల్స్)
సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. 73 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడం రికార్డు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారాధ్యంలో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జట్టు స్పీడ్ తో ముందుకు సాగింది. పార్టీ స్థాపించిన 43 ఏళ్లలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరగడం విశేషం. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. ఈ స్వల్ప వ్యవధిలోనే 73 లక్షల సభ్యత్వ నమోదు జరగడం నిజంగా రికార్డ్ బ్రేక్. అధికారంతో సంబంధం లేకుండా తెలుగుజాతి ప్రయోజనాల కోసం 43 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పార్టీ తెలుగుదేశం. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయస్థాయిలో తమ ఉనికి చాటుకుంటుంది. అధునాతన విధానాలతో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. టాప్ 5లో రాజంపేట, నెల్లూరు సిటీ, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయి.సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది.సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది.సభ్యత్వ నమోదు అంశాలను ఆ విభాగ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు. నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా..ఇందులో 85 వేల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి పొందారు.
ఇప్పటి వరకు జరిగిన నమోదులో 54 శాతం మంది కొత్త వారు సభ్యత్వం తీసుకున్నారుసభ్యత్వ నమోదులో 1.18 లక్షలతో రాజంపేట మొదటి స్థానంలో ఉండగా, నెల్లూరు సిటీలో 1.06 లక్షలు, కుప్పంలో 1.04 లక్షలు, పాలకొల్లులో 1.02 లక్షలు, మంగళగిరిలో 90 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. సభ్యత్వ కార్యక్రమంపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.సభ్యత్వ కార్యక్రమంతో పార్టీ బలమైన కార్యకర్తల ఆర్మీని తయారు చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు తెలుగుదేశం సభ్యత్వం పొందే పరిస్థితి రావాలన్నారు. సభ్యత్వ నమోదుపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన నేతలను అభినందించారు. కేడర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు తో బలమైన టిడిపి ఆర్మీ ని తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీది ప్రత్యేక స్థానం.తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమం అందించడంతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారుకష్టపడి పని చేసిన వారికి మెరిట్ పద్దతిలో పదవులు ఇవ్వడంతో పాటు.. ఆయా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టే కార్యక్రమం పార్టీలో అన్ని స్ధాయిలో జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీకి చెందిన ఇతర విభాగాల పని తీరుపైనా చంద్రబాబు సమీక్షించారు.