విక్రాంత్ రెడ్డి కోసం గూగుల్ సెర్చ్…
కాకినాడ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్)
విక్రాంత్‌రెడ్డి. గతంలో ఈ పేరు ఎక్కడా వినిపించలేదు కదా. అటు రాజకీయాల్లో కానీ.. ఇటు ఇతర రంగాల్లో కానీ కనిపించని ఆ వ్యక్తే… YS ఫ్యామిలీకి ఆర్థికవనరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకలపై అంశంపైనే ఈ పేరు బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడా వినిపించన పేరు కోసం.. కొందరు గూగుల్ సెర్చ్ చేశారట. మొత్తానికి విక్రాంత్ రెడ్డి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చేసింది. ఆయన TTD మాజీ ఛైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి తనయుడు.అసలు విక్రాంత్‌రెడ్డిపై ఉన్న అభియోగాలు ఏంటో ఓ సారి చూద్దాం. కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుని బెదిరించటమే కాకుండా… ఆయన్ను ఇబ్బందులు పాలు చేసి 41.12 శాతం వాటాని బలవంతంగా బదలాయించడంలో విక్రాంత్ రెడ్డి కీలకమట. ఆ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రాంత్‌రెడ్డి…ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఒక్కో విషయం బయటకు వస్తుంటే.. చాలా మందీ ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఎందుకంటే ఇన్నాళ్లూ తాడేపల్లి ప్యాలెస్‌కు ఫైనాన్స్ సమకూర్చింది ఇతగాడేనని తెలుసుకున్న సొంత పార్టీ నేతలే.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. సుబ్బారెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచీ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. ప్రకాశంజిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో మేదరమెట్ల గ్రామానికి చెందిన Y.V.సుబ్బారెడ్డి 30 ఎకరాలు భూస్వామి. ఆయన ఏకైక సంతానమే ఈ విక్రాంత్ రెడ్డి. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత విజయమ్మ, షర్మిల వైపు సుబ్బారెడ్డి నిలబడ్డారట. ఇది తెలుసుకున్న జగన్… చిన్నాన్నను దూరం పెడుతూ వచ్చారు. తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు, రాజకీయ కారణాలు నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి కూడా జగన్ ఇంట్లో కీలక వ్యక్తిగా మారాడట. ఏ స్థాయిలో అంటే… తాడేపల్లికి చెందిన ప్రతి ఆర్థిక లావాదేవీలూ.. విక్రాంత్‌రెడ్డే చూసుకునే వారట. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలూ చక్కబెడుతూ.. అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడట.
2020 నుంచి విక్రాంత్ రెడ్డి చేతుల మీదుగానే తాడేపల్లి ఆర్థిక వ్యవహారాలు సాగాయంటేనే తెలుస్తోంది. అతనికి ఉన్న పవర్ ఏంటోతాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ప్రతి ఆదేశాలనూ విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా పాటించేవారట. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించిన ఆర్థిక సెటిల్‌మెంట్లు విక్రాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగేవంటేనే ఊహించుకోవచ్చు. అతను సామర్థం ఏంటో? 2021 నుంచి 2023 వరకూ… అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మైనింగ్ మాఫియాలో ఇతను కీలకంగా వ్యవహరించారనే వార్తలు గుప్పమన్నాయి. ఈ మాఫియాకు కొనసాగింపు కోసం… ఫారెస్ట్ ఏరియాలో సుమారు 40 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నారట. లేటరైట్ మైనింగ్ అంశం అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. ఈ మైనింగ్ పౌడర్‌ను భారతి సిమెంట్ తయారీతో పాటు అల్యూమినియం తయారీలోనూ ఎక్కువగా వినియోగించేవారట. తద్వారా కోట్ల రూపాయల ఆర్థికలావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.కాకినాడ పోర్టుకు సంబంధించి జగన్ సూచనలు, సలహాలు మేరకే…తనతో … విక్రాంత్ రెడ్డి అనేక సందర్భాల్లో డైరెక్ట్‌గా… ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడినట్లు…K.V. రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైవీ నివాసంలో మూడుసార్లు పైగా… శరత్‌చంద్రారెడ్డి, కేవీ రావుతో కలసి విక్రాంత్‌రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. వీటిని బేస్ చేసుకుని ఆర్థిక బదలాయింపు కొనసాగినట్లు కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఒక్కొక్కటిగా విక్రాంత్ అరాచాలు బయటకు వస్తున్నాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది.ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా… తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్థిక వ్యవహారాలను విక్రాంత్‌రెడ్డే నడిపారనే విషయం.. ఇప్పటివరకూ చాలా మందికీ తెలియదట. పైకి అందరూ… సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు మాత్రమే చెప్పినా…. ప్రతి ఆర్థికవ్యవహారాన్ని విక్రాంత్ రెడ్డి చక్కబెట్టినట్లు సమాచారం.
Read : రైస్ దందా మాటున కధలెన్నో…