సీఎం చెప్పినా వినరా_ కనిపించని ఆన్ లైన్ సేవలు

TDP Leader Chandrababu naidu

సీఎం చెప్పినా వినరా_కనిపించని ఆన్ లైన్ సేవలు

TDP Leader Chandrababu naidu

 

అనంతపురం, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్)
ఏపీలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి, ధృవ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా పౌరసేవల్లో మాత్రం మార్పు రావడం లేదు.డిజిటల్‌ పౌరసేవల్లో దేశానికే ఒకప్పుడు తలమానికంగా వ్యవహరించిన రాష్ట్రంలో ఇప్పడు ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్ డెలవరీ వ్యవస్థ పడకేసింది. గ్రామ వార్డు సచివాలయాలతో పౌరసేవల్ని అందించిన తర్వాత కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు పరిస్థితి తయారైంది.వాట్సాప్‌లోనే ప్రజలు నేరుగా డిజిటల్ ధృవీకరణలు పొందేలా టెక్నాలజీని అభిృవృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నా పౌర సేవల్లో నాణ్యత మాత్రం మెరుగు పడటం లేదు. రెవిన్యూ శాఖ ద్వారా అందించే పౌర సేవల్ని ఆన్‌లైన్‌లో నేరుగా ప్రజలు అందుకునే ఏర్పాటు కల్పిస్తున్నట్టు కొద్ది రోజుల క్రి తం ప్రకటించారు. పేరుకు ఆన్‌లైన్‌ సర్వీసులు కంప్యూటర్ తెరపై కనిపిస్తున్నా ప్రజలకు మాత్రం సర్టిఫికెట్లు జారీ కావడం లేదు. పేమెంట్‌ గేట్‌వే సమస్యలతో నగదు కట్‌ అవుతున్నా కావాల్సిన సర్టిఫికెట్లు మాత్రం జారీ కావడం లేదు.రెవిన్యూ శాఖలో ఆస్తులకు సంబంధించిన మ్యుటేషన్ సర్టిఫికెట్లు, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు, సర్టిఫైడ్ కాపీల వంటి వాటిని రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పొంద వచ్చని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే సర్టిఫికెట్ల జారీలో జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా సర్టిఫికెట్లు పొందకుండా కొందరు అడ్డు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఐసి ద్వారా అందే ప్రభుత్వ సేవల్లో కావాలనే అంతరాయలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈసీలు,సీసీలు, మ్యుటేషన్‌ వంటి పనులు చేయడానికి కమిషన్ల దందా నడుస్తుంది. ప్రతి పనికి ఫిక్సిడ్‌ ఛార్జీని వసూలు చేయడం రివాజుగా మారింది. ప్రభుత్వం నేరుగా ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తే ఆదాయానికి గండి పడుతుందనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు జారీ కాకుండా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న సర్టిఫికెట్ల చెల్లుబాటు కూడా ప్రశ్నార్థకం అవుతోంది. సచివాలయాలు, మీ సేవల్లో జారీ చేసే సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో ఇస్తున్నారు.

ప్రభుత్వ అధికారిక చిహ్నాలతో క్యూఆర్‌ కోడ్‌తో పాటు వాటికి గుర్తింపు ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎవరికి వారు సొంతంగా దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి ధృవీకరణ ఉండటం లేదు. న్యాయస్థానాలు ఇలాంటి సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాయి. సివిల్ వివాదాల్లో ఈసీలు, సర్టిఫైడ్ కాపీలపై ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి.డిజిటల్ పౌర సేవల్ని సంక్లిష్టంగా మార్చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గతంలో ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ వ్యవస్థ సమర్ధవంతంగా పౌరసేవల్ని అందించేది. మీసేవల్లో దరఖాస్తు చేస్తే కావాల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వ గుర్తింపుతో జారీ చేసేవారు. సచివాలయాల్లో సర్టిఫికెట్లు వాట్సాప్‌లో జారీ చేసి, సాంకేతిక కారణాలు చెప్పి.. మీ సేవల్లో ప్రింట్ తీసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. పిడిఎఫ్‌ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేశారో ధృవీకరించే ఏర్పాటు కూడా లేదు. నకిలీ సర్టిఫికెట్లు పుట్టుకొస్తే ఎవరు బాధ్యులనే ప్రశ్న ఎదురవుతోంది.డిజిటల్ పౌరసేవల విషయంలో ప్రధాన కార్యదర్శుల స్థాయి అధికారుల్ని కూడా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. డిజిటల్‌ సేవల్లో ఎదురవుతున్న సమస్యల విషయంలో మభ్యపెడుతున్నారు.ప్రజలకు ఆన్‌లైన్‌ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని నివేదికలు ఇస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలకు వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది.

Related posts

Leave a Comment