రంగారెడ్డి జిల్లాలో 34 స్కూలు బస్సులపై కేసులు నమోదు | Cases registered against 34 school buses in Rangareddy district | Eeroju news

34 స్కూలు బస్సులపై కేసులు నమోదు :

రంగారెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా  ఫిట్ నెస్ లేని  34 విద్యాసంస్థల బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు.  విద్యా సంస్థల బస్సులపై  మూడవ రోజు  ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా వ్యాప్తం గా  రవాణా శాఖ అధికారులు  తనిఖీలు చేపట్టారు. ఫిట్ నెస్ లేని, పన్నులు చెల్లించని  34 బస్సులపై కేసు నమోదు చేయడం జరిగిందని అయన అన్నారు.

 

ఈ రోజు 4 బృందాలు గా ఏర్పడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తం గా రవాణా శాఖ అధికారులు  తనిఖీ లు చేపట్టారు. ఈ సందర్భం గా డి టి సి చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ  ఫిట్ నెస్ లేని,15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితులలో రోడ్ల పైకి తిప్పరాదని తెలిపారు. అనుభవం గల , 60 సంవత్సరాలు మించని డ్రైవర్లను  నియమించుకోవాలని సూచించారు.

ఈ తనిఖీ లు కొనసాగుతాయని , ప్రతీ విద్యా సంస్థ బస్సు తప్పనిసరిగా సంబంధిత రవాణా శాఖ కార్యాలయం లో ఫి ట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని తెలిపారు.ఈ దాడులలో రంగారెడ్డి, మేడ్చల్, ఉప్పల్ రవాణా శాఖ అధికారులు కిరణ్ రెడ్డి, కృష్ణ వేణి, సునీత, నవీన్, ఉపాసిని, ప్రతాప్ రాజా, త్రివేణి, శ్రీనివాస్ ,Anusha తదితరులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ వీసీల నియామకంలో జాప్యం తగదు : పృథ్వి తేజ | There should be no delay in the appointment of University VCs : Prithvi Teja | Eeroju news

 

Related posts

Leave a Comment