యూనివర్సిటీ వీసీల నియామకంలో జాప్యం తగదు : పృథ్వి తేజ | There should be no delay in the appointment of University VCs : Prithvi Teja | Eeroju news

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీల పదవీ కాలం ముగియడానికి వస్తున్న ఇప్పటి వరకు సెర్చ్ కమిటీల మీటింగ్ జరగకపోవడన్ని నిరసిస్తూ ABVP స్టేట్ జాయింట్ సెక్రటరీ పృథ్వి తేజ మాట్లాడుతూ  ఇంచార్జి వీసీల పదవీ కాలం సైతం ముగియడానికి వచ్చింది .అయిన కూడా ఇప్పటి వరకు కనీసం సెర్చ్ కమిటీల మీటింగ్ జరగకపోవడం విడ్డూరం.

గత ప్రభుత్వం లాగే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు . గతంలో యూనివర్సిటీ వీసీ పదవీ కాలం ముగియకముందే సెర్చ్ కమిటీ వేసి నూతన వీసీల ఎంపిక జరిపేవారు .

కానీ ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం వీసీల నియామకంలో జాప్యం చేసి యూనివర్సిటిలను అంధకారంలోకి నెట్టుతున్నాయి. వెంటనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూనివర్సిటీల కేంద్రంగా ఉద్యమానికి సైతం వెనకడం అని హెచ్చరించారు .

Related posts

Leave a Comment