Metro | డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ | Eeroju news

డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ

డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ

హైదరాబాద్, నవంబర్ 28 (న్యూస్ పల్స్)

Metro

Hyderabad Metro: Project Information, Tenders, Stations, Routes and Updates | Urban Transport Newsహైదరాబాద్ మెట్రో రైలు కల నెరవేరింది. కానీ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక నగరంలో ఏ మూలన నుండైనా రాకపోకలు యమ ఫాస్ట్ గా సాగిపోతాయి. అంతేకాదు.. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా మరో గుడ్ న్యూస్ కూడా నగరవాసులకు ఉంది. అదేంటో తెలుసా.. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం కూడా రాబోతోంది. ఇప్పటి వరకు ఢిల్లీకి పరిమితమైన ఈ సదుపాయం.. హైదరాబాద్ నగరవాసుల ముందుకు రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుండగా, మెట్రో పరుగులు ఇక నగరవాసులకు మరింత చేరువ కానున్నాయి.

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఇప్పుడసలు ఊహించలేము. పెరిగిన నగర రద్దీ కారణం కాగా, యమ ఫాస్ట్ రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా మరింత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. Hyderabad Metro Rail extends popular schemes for six months-Telangana Todayఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు.5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో భాగం కానుంది.

మియాపూర్ నుండి పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుండి ఎయిర్ పోర్ట్ వరకు 24 స్టేషన్లు నిర్మించాలని మెట్రో భావిస్తోంది. అయితే ఇక్కడే అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా మెట్రో రవాణా సౌకర్యం కల్పించి, నాలుగు స్టేషన్లను తగ్గించాలని కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మెట్రో రెండోదశమిస్తారనిపై సీఎం రేవంత్ రెడ్డితో మెట్రో రైలు ఎండీ చర్చలు జరపగా, త్వరలోనే కార్యాచరణకు అన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

జనవరి మొదటి వారంలో ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ పనులు ప్రారంభం కానుండగా, ప్రతి కిలోమీటర్ కి మెట్రో మార్గం నిర్మాణానికి రూ.318 కోట్లు ఖర్చు అవుతుందని ఎండీ ఎన్.వీ.ఎస్ రెడ్డి తెలుపుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ నగర వాసుల మెట్రో కల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తిస్థాయిలో విస్తరించనుందని చెప్పవచ్చు.

డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ

 

Hyderabad Metro | సిటీ మొత్తం మెట్రో పరుగులు | Eeroju news

Related posts

Leave a Comment