ఫేక్ జీవోలు…మండిపడుతున్న టీ కాంగ్రెస్… | Fake creatures.. Burning Tea Congress… | Eeroju news

హైదరాబాద్, జూన్ 14, (న్యూస్ పల్స్)

నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టేస్తుందంటారు. ఏ మహానుభావుడు చెప్పాడో కానీ.. ఇది ముమ్మాటికి నిజమనిపిస్తుంది కొన్ని సీన్స్‌ను చూస్తే.. దీనికి లెటెస్ట్ ఎగ్జాంపుల్ TS నుంచి TGకి పేరు మార్చేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించిన ప్రచారం. ఒకరు 2 వేల కోట్లు అంటారు.. మరికొందరు 4 వేల కోట్లు అంటారు. ఇంతకీ ఇందులో ఏది నిజం..? ఏది అబద్ధం..?తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరగానే తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో.. TS నుంచి TGగా పేరు మార్చడం ఒకటి.. మరి చెప్పినంత ఈజీగా జరగదు కదా పని.. గవర్నమెంట్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఈ మార్పు జరగాలి.. దీనికి కాస్త ఖర్చవుతుంది..

ఇది నిజం.. బట్.. ప్రభుత్వంపై ఎప్పుడెప్పుడు బురద జల్లుదామా? అని ఎదురుచూసే విపక్షం.. దీనిని అస్త్రంగా మలుచుకుంది. ప్రజాపాలన పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ కొత్త రాగం ఎత్తుకుంది. హైలేట్ ఏంటంటే.. ఇందులో ప్రభుత్వం చేస్తున్న ఖర్చును కూడా డివైడ్ చేసింది. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు.. TS నుంచి TGగా మార్చడం కోసం 1771 కోట్లు.. కార్యాలయాల పేర్ల మార్పు కోసం 461 కోట్లు.. ఇనిస్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం 842 కోట్లు.. అడ్వర్టైజ్‌మెంట్స్‌ అండ్ కమ్యూనికేషన్స్‌ పేర్ల మార్పు కోసం 563 కోట్లు.. పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం 5 కోట్లు.. ఇలా డివైడ్ చేసి మొత్తం 4 వేల 639 కోట్లు ఓ లెక్కను కూడా ఫైనల్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు..దీనికి ముందు మరో డాక్యుమెంట్‌ కూడా వైరల్‌ అయ్యింది. TS నుంచి TGగా పేరు మార్చేందుకు 2 వేల 767 కోట్లు ఖర్చవుతాయంటూ వైరల్ అయ్యింది ఓ డాక్యుమెంట్.. అఫ్‌కోర్స్‌ ఇది ఫేకే.. బట్ దానిని క్రాస్‌ చెక్ చేసే ఓపిక నేతలకు ఎందుకు ఉంటుంది. మనకు పనికి వచ్చేదా? కాదా? అని మాత్రమే ఆలోచించారు. షేర్‌ చేయడం స్టార్ట్ చేశారు..నిజమేంటో తెలియదు.. తెలుసుకునే ఉద్దేశం కూడా లేదు. బట్ ప్రజల్లోకి మాత్రం బలంగా వెళ్లింది. రేవంత్‌ రెడ్డి అనవసరంగా ఖర్చు చేస్తున్నారని.. మరి నిజాలు తెలియకపోతే అది అనర్థాలకు దారి తీస్తుంది. ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం పెరుగుతుంది. అందుకే కాంగ్రెస్‌ నేతలు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ముందుగా అసలు ఈ ఫేక్‌ డాక్యుమెంట్‌ను ఎవరు రూపొందించారు? ఎక్కడ రూపొందించారు? ఎవర్ అప్‌లోడ్ చేశారు? ఎందుకు చేశారు? ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు సైబర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ స్టార్ట్ చేశారు. రేపో, మాపో వారు దొరక్కపోటు.. కటకటాల వెనక్కి వెళ్లకా పోరు.ఇప్పుడు బీఆర్ఎస్‌ నేతల విషయానికి వద్దాం.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు. పాలనపై ఓ అవగాహన ఉంది. ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో ఓ ఐడియా ఉంది. మరి ఇన్ని తెలిసి కూడా.. ఏ నోట్‌ను బేస్‌గా తీసుకోవాలి.. ఏ నోట్‌ను తీసుకోకూడదు అనే కామన్‌సెన్స్‌ లేకపోతే ఎలా? మంచి డిజైన్ చేసి.. ఖర్చుల లెక్కలు బాగా కనిపించేలా బాగానే ఎడిట్ చేశారు.

మరి ఆ శ్రద్ధ.. ఇది నిజమా? కాదా? అనే దానిపై ఎందుకు పెట్టలేదు.. ? నిజంగా తెలియదా? లేక తెలిసినా మనకు వచ్చే నష్టం ఏముందిలే అనుకున్నారా?ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఇలానే తప్పుడు డాక్యుమెంట్స్‌ సృష్టించి చిక్కుల్లో పడ్డారు బీఆర్ఎస్‌ నేతలు.. ఓయూ ఇష్యూలో ఏకంగా తప్పుడు సర్క్యూలర్‌నే సృష్టించారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ అయితే అరెస్ట్ కూడా అయ్యారు.

ఇప్పుడిదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు చెప్పండి.. నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్దం ఊరంతా తిరిగి వచ్చిందా? లేదా? విపక్షం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే దానిపై బీఆర్ఎస్ కొంచెం గ్రౌండ్ వర్క్‌ చేస్తే బెటర్‌ అంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.. తప్పుంటే నిలదీయాలి..? అవకతవకలు ఉంటే ప్రశ్నించాలి..? ప్రజాసంక్షేమం కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలో ఉండి పోరాడాలి? ఇందులో ఎలాంటి తప్పు లేదు.

బట్.. చేసిన ప్రతి పనిలో తప్పులెతకడం.. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించడం చేస్తే.. ఇలానే అవమానాల పాలవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో అంతంత మాత్రంగా ఉన్న అభిమానం కాస్త మరింత చులకనయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు..ఈ డిజిటల్ యుగంలో నిజాన్ని అబద్ధంగా.. అబద్ధాన్ని నిజంగా మార్చడం చాలా ఈజీ.. సో ఓ నిర్ణయానికి వచ్చే ముందు కాస్త దాన్ని డీప్‌గా అనలైజ్ చేయడం బెటర్.

Related posts

Leave a Comment