Telangana | కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా | Eeroju news

కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా

కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా

హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్‌)

Telangana

KTR Booked For Calling Revanth 'Cheap' Ministerఅరెస్టు కావడానికి నేను రెడీ అని కేటీఆర్ చాలెంజ్ చేసి చాలా రోజులు అయింది. ఓ రాత్రి ఆయనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కాపలా కాశారు. కానీ ఆయన అరెస్టు కాలేదు. అసలు పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని తాను కూడా జైలుకెళ్లాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. రేవంత్ స్పందనను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు లేదని అనుకోవచ్చంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఈ రేసు విషయంలో రూ. 55 కోట్ల గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. లెక్కాపత్రం లేకుండా రూ. 55కోట్లను విదేశీ కంపెనీకి తరలించారని కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయంలో బాధ్యుడు అవ్వాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి తన తప్పం లేదని అంతా కేటీఆర్ ఆదేశించడం వల్లే తాను చేశానని నివేదిక ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలు నోటి మాట ద్వారా ఇచ్చారని చెబుతున్నారు. దీంతో నగదు అక్రమంగా తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ కీలక పాత్ర కాబట్టి ఆయనను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై కేసులు పెట్టారంటే.. 17A ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలి. అయితే ఇప్పటి వరకూ గవర్నర్ అనుమతి రాలేదు. గతంలో రేవంత్ మీడియాతో మాట్లాడినప్పుడు గవర్నర్ అనుమతి వస్తే అరెస్టు చేస్తామని ప్రకటించారు.

ఆ రూ. 55కోట్లు ఎక్కడికిపోయాయో తేలుతుందని చెప్పుకొచ్చారు. మరో మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి దీపావళిలోపే బాంబులు పేలుతాయన్నారు. కానీ ఏవీ పేలలేదు. అంతే కాదు ఇప్పుడు అరెస్టు అయితే సానుభూతి వస్తుందన్న కోణంలో ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అందుకే కేటీఆర్ అరెస్టు ఉండకపోచవచ్ని అంటున్నారు.నిజానికి కేటీఆర్ ను ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కాకపోయినా.. కలెక్టర్ పై దాడి కేసులో అరెస్టు చేస్తారని అనుకున్నారు.

ఆ కేసులో అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు. అయితే పోలీసులు మాత్రం అరెస్టు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొందరపడి అరెస్టులు చేయడం వల్ల వారికి రాజకీయంగా మేలు జరుగుతుందని అలాంటి పరిస్థితి లేకుండా.. వారిని అరెస్టు చేయడం కరెక్టే అనే భావన వచ్చే వరకూ వారు చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోందది. ఈ లెక్క ప్రకారం కేటీఆర్ అరెస్టు ఇప్పుడల్లా ఉండకపోవచ్చని అంటున్నారు.

కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా

Kavitha | కేటీఆర్ స్థానాన్ని కవిత రీ ప్లేస్ చేస్తారా… | Eeroju news

Related posts

Leave a Comment