Pawan Kalyan | ఎన్డీయే వారియర్ గా పవన్ | Eeroju news

ఎన్డీయే వారియర్ గా పవన్

ఎన్డీయే వారియర్ గా పవన్

హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్)

Pawan Kalyan

Pawan Kalyan: నేడు వైజాగ్‌కి పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే! - NTV Teluguబీజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుందని భావించింది. 300 పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మిత్రులతో కలిసి 400 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. కానీ 240 సీట్లు వద్ద బిజెపి బలం ఆగిపోయింది. మిత్రుల అవసరం ఏర్పడింది. సరిగ్గా ఇదే సమయంలో టిడిపి 16, నితీష్ నేతృత్వంలోని జెడియు 12 స్థానాలతో ఆదుకున్నారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చామన్న సంతోషం కంటే.. బలం తగ్గిందన్న బాధ బిజెపి పెద్దలను వెంటాడింది. అదే సమయంలో మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఓటమి తప్పదని సంకేతాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాల్లో విజయం సాధించింది బిజెపి. అయితే బిజెపి అగ్ర నేతల చరిష్మ తగ్గిన సమయంలో.. దానిని భర్తీ చేసేందుకు రంగంలోకి దిగారు పవన్.

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి బిజెపి విజయానికి కారణమయ్యారు. దీంతో పవన్ సేవలను జాతీయస్థాయిలో వినియోగించుకోవాలని బిజెపి అగ్ర నేతలు ఆలోచిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏకు వారియర్ గా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.ఏపీలో కూటమి కట్టడంలో సక్సెస్ అయ్యారు పవన్. టిడిపిని తన వెంట తీసుకెళ్లడమే కాదు బిజెపిని ఒప్పించడంలో కూడా సక్సెస్ అయ్యారు. కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. పవన్ లో ఆ గుణం మెచ్చిన బిజెపి అగ్రనేతలు ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అయితే పవన్ అకస్మాత్తుగా సనాతన ధర్మం వైపు అడుగులు వేయడం కూడా అనుమానాలకు తావిచ్చింది. దీని వెనుక బిజెపి ఉన్నట్లు ప్రచారం సాగింది. అటు పవన్ చర్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఆహ్వానించిన వారు ఉన్నారు.వ్యతిరేకించిన వారు ఉన్నారు.దీంతోనే బిజెపి అగ్రనేతలకు ఒక ఆలోచన వచ్చింది. పవన్ ముందు పెట్టి మరోసారి జాతీయస్థాయిలో బిజెపిని బలోపేతం చేయాలని చూస్తున్నారు. అందుకే ఎన్డీఏలో పెద్దన్న పాత్ర ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అంచనాలు తప్పాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో క్రమేపి బిజెపి ప్రభావం తగ్గుతుందని గ్రహించారు అగ్రనేతలు. దీనికి సరైన విరుగుడు చర్య ప్రారంభించక పోతే నష్టం అని భావించారు. అయితే ఈ సమయంలోనే పవన్ లో ఉన్న శక్తిని గుర్తించారు.

పవన్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను దేశవ్యాప్తంగా అనుసరించాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు తరువాత చాలా రాష్ట్రాలకు సైతం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలో పవన్ సేవలను వినియోగించుకోవాలని బిజెపి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. క్రమేపి పవన్ ను ఢిల్లీ స్థాయిలో నిలపాలన్నది పెద్దల ప్లాన్ గా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఎన్డీయే వారియర్ గా పవన్

Pawan Kalyan | పవన్ ప్రచారంతో బీజేపీకి పెరిగిన ఓటు షేర్ | Eeroju news

Related posts

Leave a Comment