Telangana | కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా.. | Eeroju news

కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా..

కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా..

రేవంత్‌రెడ్డి నోట సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్)

Telangana

తెలంగాణలో రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. లగచర్ల ఘటన తర్వాత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మొన్నటి వరకు రైతు రుణమాఫీ, తర్వాత మూసీ ప్రక్షాళనపై ఇరుపక్షాలు రాజకీయం చేశాయి. ఇప్పుడు లగచర్ల ఘటనపై అధికార, విపక్షాల మధ్య పొలిటకల్‌ వార్‌ నడుస్తోంది. లగచర్లలో రైతులను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేయిస్తోందని బీఆర్‌ఎస్‌ నాయకులు రేవంత్‌ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక అధికారులపై దాడిచేసిన వారిని అరెస్టు చేయకుండా ముద్దు పెట్టుకుంటామని బీఆర్‌ఎస్‌కు దీటుగా బదులిస్తున్నారు.

అధికార పార్టీ మంత్రులు, నేతలు. తాజాగా ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. లగచర్ల కుట్ర వెనుక ఉన్నవారితో కూడా ఉచలు లెక్కబెట్టిస్తానని పరోక్షంగా కేటీఆర్‌ను హెచ్చరించారు. వేములవాడ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ను కుట్రదారుగా సీఎం అభివర్ణించారు. ఆయన కుట్రలను గమనిస్తునానమని తెలిపారు. త్వరలోనే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు.కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఏ పనిచేసినా దానిని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆ ఇద్దరినీ టార్గెట్‌ చేశారు.

బిల్లా, రంగ అంటూ ప్రతీ మీటింగ్‌లో ఇద్దరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేటీఆర్‌ను పక్కా ఆధారాలతో అరెస్టు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో హరీశ్‌ నోరు కూడా మూత పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫార్ములా–1 రేసు కేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి కేటాయించిన కేసులో కేటీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు తాజాగా జరిగిన లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్‌ పేరే ప్రనముఖంగా వినిపిస్తోంది.కేటీఆర్‌పై కోపంతో ఊగిపోతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పటి వరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు గురించి ఎక్కడా మాట్లాడలేదు.

కానీ తొలిసారిగా వేములవాడ సభలతో తన మనసులో మాట బయట పెట్టారు. త్వరలోనే కేటీఆర్‌ ఊచలు లెక్కబెడతారని స్పష్టం చేశారు. ఫార్ములా రేసుతోపాటు, లగచర్ల ఘటన కుట్రదారుగా కేటీఆర్‌పై అభియాగాలు ఉన్నాయి. ఇప్పటికే లగచర్ల ఘటనలో పట్నం మహేందర్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఏ2 నిందితుడు సురేష్‌ కోర్టులో లొంగిపోయాడు. వీరి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ అరెస్టు గురించి గుట్టు విప్పారని తెలుస్తోంది. అందులో భాగంగా కేటీఆర్‌ను కుట్రదారుగా అభివర్ణించారు.

కేటీఆర్‌ను జైలుకు పంపిస్తా..

Till today KTR is calm in the High Court | నేటి వరకూ కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట | Eeroju news

Related posts

Leave a Comment