కాళేశ్వరం విచారణకు కేసీఆర్ రావాల్సిందేనా
కరీంనగర్, నవంబర్ 20, (న్యూస్ పల్స్)
KCR
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ హీట్ క్రియేట్ చేస్తోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌విచారణను స్పీడప్ చేసింది.ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులను విచారించింది కమిషన్. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్‌కు రాబోతుందట. వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్..మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేసిన హరీశ్ రావును కూడా విచారణకు పిలుస్తారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూలోనే కేసీఆర్‌ను ఇరికించే ప్రయత్నం జరిగింది. అప్పుడు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇస్తే మాజీ సీఎం విచారణకు హాజరుకాలేదు. అంతేకాదు జస్టిస్నరసింహారెడ్డి కమిషన్‌కు విచారణార్హత లేదంటూ లేఖ రాశారు.న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ఏర్పాటైందని..అలాంటి కమిషన్ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. దాంతో ఏకంగా విచారణ కమిషన్ చైర్మన్ నే మార్చాల్సి వచ్చింది సర్కార్ కు. మరి ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌ను విచారణ పిలిస్తే వెళ్తారా.?
కేసీఆర్ విచారణకు హాజరుకాకపోతే కమిషన్ ఎలా ముందుకు వెళ్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి..ఈ నెలాఖరున కేసీఆర్‌కు పిలుపు రాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ విచారణకు వెళ్లకపోతే అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అంత డేర్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని హంగామా చేసిన కాంగ్రెస్ఇప్పుటికే డైలమాలో పడింది. లగచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్ట్‌పై బ్యాక్ స్టెప్ వేసినా కాంగ్రెస్ పెద్దలు..ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ అనుమతి రాగానే ఆయన్ను జైలుకు పంపుతామంటున్నారు. ఇంతలోనే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందిఅయితే విచారణకు కేసీఆర్హాజరవుతారా? లేక జస్టిస్ఎల్.
నర్సింహారెడ్డి కమిషన్‌కు లేఖ రాసినట్లుగా..జస్టిస్పీసీ ఘోష్‌కు లేఖ రాసి దూరంగా ఉంటారా? అన్న చర్చ సాగుతోంది. జస్టిస్ఎల్.నర్సింహారెడ్డి స్థానంలో నియమితులైన జస్టిస్మదన్భీంరావు లోకూర్కమిషన్మాత్రం కేసీఆర్‌ను విచారణకు పిలవకుండానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు కూడా కేసీఆర్విచారణకు రాకపోతే..ఆయన ఇచ్చే లేఖనే అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీ ఘోస్ కమిషన్ విచారణపై కూడా కేసీఆర్ స్టడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు నోటీసులు ఇస్తే ఎలా రియాక్ట్ కావాలో కూడా గులాబీ బాస్ ఓ క్లారిటీకి వచ్చినట్లు ఇన్సైడ్ టాక్.ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి హామీలు, గ్యారెంటీల విషయంలో తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తోంది కాంగ్రెస్.
అందుకే అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఆరోపణలు చేసిన ఇష్యూస్‌లో కేసీఆర్ ఫ్యామిలీని ఇరికించి సైలెంట్ అయిపోయేలా చేయాలని ప్లాన్ చేస్తోందట రేవంత్ సర్కార్. ఈ టైమ్‌లో అటు కాళేశ్వరం విచారణ..ఇప్పటికే జరుగుతోన్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు..ఏది ముందు..దేంట్లో అరెస్ట్‌లు ఉంటాయనేది టెన్షన్ క్రియేట్ చేస్తోంది.పీసీ ఘోష్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అన్నది ఒక డిస్కషన్ అయితే. ఎలా స్పందిస్తారనేది ఇంకో పాయింట్. అదే సమయంలో ఫార్ములా ఈ రేస్ విషయంలో గవర్నర్ అనుమతిస్తే ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఎవరి అరెస్ట్ ఉంటుంది. ముందు అరెస్ట్ అయ్యేది తండ్రా.. తనయుడా అనేది ఉత్కంఠ రేపుతోంది.
KCR & Revanth Reddy | రేవంత్‌కు సవాల్ విసరబోతున్న కేసీఆర్.. | Eeroju news