48 గంటల్లో ధాన్యం డబ్బులు

48 గంటల్లో ధాన్యం డబ్బులు

48 గంటల్లో ధాన్యం డబ్బులు

48 గంటల్లో ధాన్యం డబ్బులు

విజయవాడ, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్)
ఏపీలో ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగాఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు అందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.1.51 లక్షల మంది రైతులకు రూ.2,331 కోట్ల చెల్లింపులు జరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గతేడాది ఈ సమయానికి.. 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ జరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఒక రికార్డు అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.వరి కోతలకు ఎక్కువగా యంత్రాలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ధాన్యం మిల్లులకు రావడంతో రద్దీ ఎక్కువైంది. తేమ శాతంలో గందరగోళం ఏర్పడింది. నిబంధనల ప్రకారం తేమ శాతం 17 అయితే.. దీనికి మరో 5 శాతం కలిపి రైతులకు మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ప్రభుత్వం ఆదేశించింది. రైతులను ఇబ్బంది పెట్టే దళారులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించింది.ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల కంకిపాడు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు ప్రక్రియపై రైతులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ అవస్థలను మంత్రికి వివరించారు. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై ధాన్యం ధరను తగ్గిస్తున్నారని వాపోయారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. తేమ నెపంతో మద్దతు ధర కంటే మూడు వందల మేర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.2024-25 ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. వికేంద్రీకరణ విధానంలో రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈ- పంట, ఈకేవైసీ ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కామన్‌ వెరైటీ ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,300, గ్రేడ్‌ ఏ రకం కనీస మద్దతు రూ.2,320 చెల్లించాలని స్పష్టం చేసింది. ఖరీఫ్ సీజన్‌లో 37లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts

Leave a Comment