4 lakh crores for youth education | యువత విద్య కోసం 4 లక్షల కోట్లు | Eeroju news

4 lakh crores for youth education

యువత విద్య కోసం 4 లక్షల కోట్లు

న్యూఢిల్లీ, జూలై 24, (న్యూస్ పల్స్)

4 lakh crores for youth education

బడ్జెట్ లో అన్నింటికన్నా హైలెట్ ఏదైనా ఉందంటే.. ‘ఉద్యోగ నైపుణ్య ప్రోత్సాహకాలు’.. ఇందులో భాగంగా 5 పథకాలు ప్రకటించారు. ఉద్యోగ కల్పన కోసం ఏకంగా 2 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ ఏ బడ్జెట్ లోనూ ఇంత మొత్తం ఈ ఉద్యోగ కల్పనకు ఏ ప్రభుత్వం కేటాయించలేదు. ఈ పథకాల ద్వారా దేశంలో 4 కోట్ల 10 లక్షల మంది విద్యార్థులకు , ఉద్యోగులకు ప్రయోజనం కలుగబోతోంది. ఇది చాలా పెద్ద పథకంగా చెప్పొచ్చు. ఇదో బెస్ట్ స్కీం అని చెప్పొచ్చు..

యువత విద్య కోసం 4 లక్షల కోట్లు
స్కీమ్ ఏలో ‘మొట్టమొదటి సారి చదివి ఉద్యోగాలు చేసే విద్యార్థులకు’ 15వేల రూపాయలు చెల్లిస్తారు. 2 కోట్ల 15 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
స్కీమ్ బీలో మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలోని ఉద్యోగులకు ‘ఈపీఎఫ్ఓ’ కంట్రిబ్యూషన్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని కోసం 52 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.

స్కీమ్ సీలో ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయిర్ ల కోసం 3వేల రూపాయిలు ఈపీఎఫ్ లో ప్రభుత్వమే కడుతోంది.
ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం రెండు భాగాల్లో మొదటి భాగానికి 44వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెండో భాగంలో 30వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్ షిప్ ఇస్తారు. ప్రభుత్వమే 10వేల రూపాయలు.. తర్వాత 5 వేలు చెల్లిస్తుంది. ఈ రెండింటికి 63వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 1000 ఐటీఐలను ప్రభుత్వం అప్ గ్రేడ్ చేస్తోంది. కేంద్రం , రాష్ట్రం కలిసి ఖర్చు చేస్తుంది. కేంద్రం 30వేల కోట్లు ఇస్తుంది. సీఎస్ఆర్ నుంచి 20వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్లు ఇస్తుంది.

4 lakh crores for youth education

 

Rahul Gandhi angry over NEET paper leakage | విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు నీట్ పేపర్ లీకేజీ పై మండిపడ్డ రాహుల్ గాంధీ | Eeroju news

Related posts

Leave a Comment