30 years of struggle has been served | 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది | Eeroju news

30 years of struggle has been served

30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది

న్యూఢిల్లీ, ఆగస్టు 1

30 years of struggle has been served

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని పేర్కొన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది.

కాగా.. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.. మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ.. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందంటూ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారని మందకృష్ణ పేర్కొన్నారు. అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ చేసేలా చూసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలంటూ పేర్కొన్నారు.

ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని.. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని పేర్కొన్న మందకృష్ణ.. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమడ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని.. రీనోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని.. తమకు సహకరించినవారి కోసం అభినందన సభ ఏర్పాటు చేస్తామంటూ మందకృష్ణ కోరారు.

30 years of struggle has been served

 

Modi’s full-fledged visit is very important to them Russian President Vladimir Putin | మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనది | Eeroju news

Related posts

Leave a Comment