ఆగస్టు 15 నుంచి 3 పథకాలు
విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్)
3 schemes from August 15
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నుంచి మరో పథకాన్ని ప్రారంభించనుంది. ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు… మరో వైపు ఆగస్టు 15న వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పట్టణ ప్రాంతాల్లో 184 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం కొన్ని కారణాలతో మొదట వంద ఏర్పాటు చేయాలని మిగిలిన 84 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఐదు రూపాయలకే భోజనం అందివ్వాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు.
వీటి కోసం వివిధ పట్టణాల్లో ప్రత్యేక భవనాలు నిర్మించారు. వైసీపీ హయాంలో వీటిని మూసివేసింది. అన్న క్యాంటీన్లను ఎత్తేసింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే అన్నక్యాంటీన్లు ఏర్పాటుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 184 క్యాంటీన్యూ ఒకేసారి ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భవన నిర్మాణ పనుల్లో ఆలస్యం కారణంగా ప్రస్తుతానికి పనులు పూర్తైన వంద క్యాంటిన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. విద్యాశాఖలో అమలు అవుతున్న పథకాలకు కొత్త పేర్లు పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ శాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. . దేశానికి సేవలు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్‌కలాం, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టనున్నట్లు లోకేష్ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
పాజిటివ్ వచ్చిన వాళ్లను వెంటనే క్యాన్సర్ కేంద్రాలకు తరలించనున్నారు. దీని కోసం మూడు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వైద్యశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు ముందుగా క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచాలని భావిస్తున్నారు. పెరిగిపోతున్న క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించి మెరుగైన వైద్య సాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకే ఇంటి వద్దే క్యాన్సర్ పరీక్షలు చేయనున్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వైద్య ఖర్చులు కూడా తగ్గుతాయి.
అందుకే ఈ పరీక్షలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. క్యాన్సర్ గుర్తించేందుకు మూడు రకాల పరీక్షలు చేస్తారు. దీనిలో పాజిటివ్ వచ్చిన వాళ్లను గుంటూరు, విశాఖ, కర్నూలులోని ఏదో కేంద్రానికి రిఫర్ చేస్తారు. అక్కడ వాళ్లకు మెరుగైన వైద్యం అందిస్తారు. క్యాన్సర్ తీవ్రంగా ఉంటే వేరే క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. పరీక్షలు చేస్తూనే క్యాన్సర్ రావడానికి ఉన్న మార్గాలేంటీ, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నారు.
Anna canteens from August 15 | ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటిన్లు | Eeroju news