Visakhapatnam:19న అవిశ్వాస తీర్మానం:విశాఖ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అవిశ్వాస తీర్మాన రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి ఉంది. అవిశ్వాస తీర్మానం గెలిచేందుకు అవసరమైన వ్యూహాన్ని టిడిపి కూటమి అనుసరిస్తుంది. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
19న అవిశ్వాస తీర్మానం
విశాఖపట్టణం, ఏప్రిల్ 5
విశాఖ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అవిశ్వాస తీర్మాన రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి ఉంది. అవిశ్వాస తీర్మానం గెలిచేందుకు అవసరమైన వ్యూహాన్ని టిడిపి కూటమి అనుసరిస్తుంది. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యగా తమ కార్పొరేటర్ లను సేఫ్ జోన్ లోకి పంపింది. బెంగళూరు శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన సైతం తాజాగా జాగ్రత్తలు పడినట్లు సమాచారం. టిడిపి సైతం తమ కార్పొరేటర్ లను ఏకంగా దేశం దాటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోందిగ్రేటర్ విశాఖలో 98 డివిజన్లు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 58 చోట్ల విజయం సాధించి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 29 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది తెలుగుదేశం పార్టీ. జనసేన నుంచి ముగ్గురు గెలిచారు.
వామపక్షాలతో పాటు బిజెపి ఒక్కో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓ అయిదు చోట్ల ఇండిపెండెంట్ ల సైతం గెలుపొందారు. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది కార్పొరేటర్లు గుడ్ బై చెప్పారు. టిడిపి తో పాటు జనసేనలో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ బలం తగ్గింది. అదే సమయంలో జనసేన బలం 11 కు పెరిగింది. ఓ పదిమంది వరకు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. మరో 12 మంది వరకు ఎక్స్ ఆఫీసుయో సభ్యులు ఉన్నారు. దీంతో సునాయాసంగా గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చని భావిస్తోంది టిడిపి.ఈ నెల 19న జీవీఎంసీలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కూటమికి సరిపడినంత బలం లేదని వైసీపీ చెబుతోంది. తమ పార్టీ కార్పొరేటర్లు తమ శిబిరంలోనే ఉన్నారని చెప్పుకొస్తోంది. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత మేయర్ పీఠం టిడిపికి వస్తుండడంతో ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రెండు రోజుల కిందట ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చారు నారా లోకేష్.
ఆ సమయంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అందుకే టిడిపి నేతలు ఒక వ్యూహం ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్ లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇంతవరకు జనసేనకు ఉన్న కార్పొరేటర్ల బలం 11. జనసేన ఇంతవరకు వారిని ఎటువంటి శిబిరాలకు తరలించలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవిని జనసేన కోరుతున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జనసేన కొత్త షరతు పెడుతోంది. మేయర్ పదవి టిడిపి తీసుకుంటే.. ఏకైక డిప్యూటీ మేయర్ పదవిని తమకు విడిచి పెట్టాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే విషయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు. డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆ రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతోందని చెప్పుకొచ్చారు. విశాఖ మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ పోస్టులను సైతం తామే పదిలం చేసుకుంటామని.. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి తీరుతామని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Read more:Vijayawada:జగన్ ను చుట్టేస్తున్న కేసులు