Visakhapatnam:వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. దశలవారీగా తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దశల్లో 2,603 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఇప్పటకే 1,223 మంది పర్మినెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారు.రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ పనులు చకచక జరుగుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ నుంచి 3,823 ఉద్యోగులు తొలగింపు
సమ్మెకు సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు
విశాఖపట్టణం, ఏప్రిల్ 5
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు విషయంలో యాజమాన్యం వెనక్కి తగ్గడం లేదు. దశలవారీగా తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు దశల్లో 2,603 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఇప్పటకే 1,223 మంది పర్మినెంట్ ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారు.రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్ఐఎన్ఎల్) ప్రైవేటీకరణ పనులు చకచక జరుగుతున్నాయి. ఒకపక్క అధికార టీడీపీ నేతలు ప్రైవేటీకరణ కాదని చెబుతున్నారు. కానీ మరోవైపు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అనుకూల విధానాలు అమలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. పర్మినెంట్ ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించే చర్యలు చేపడుతున్నారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో మూడు నెలలకు 1,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలని, అలా ఏడాదికి 5,600 మంది ఉద్యోగులను తొలగించాలని స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
అందులో భాగంగానే గతంలో 1,100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించగా, తాజాగా మరో 1,503 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపారు. మరో 440 మంది కాంట్రాక్ట్ కార్మికులను రెన్యూవల్ చేయకుండా బయట ఉంచారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు కొనసాగుతున్నాయి.ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి యాజమాన్యంపై రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. ప్రతిరోజూ వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. మొదటిలో మెడికల్ ఫిట్‌నెస్ లేనివారిని, 55 ఏళ్ల పైబడినవారిని తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. స్టీల్‌ప్లాంట్‌లో దాదాపు 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, దాదాపు 10,000 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 2,603 మందిని తొలగించారు. పర్మినెంట్ ఉద్యోగుల్లో 1,223 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు.ఇలా దశలవారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, పర్మినెంట్ ఉద్యోగులు సంఖ్యను తగ్గిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గుదల స్టీల్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని, ఇప్పటికే సెయిల్‌తో పోల్చితే వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులు తక్కువగా ఉన్నారని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఇప్పుడు ఉద్యోగులను తగ్గించడంతో మరింత నష్టం వాటిల్లుతుందని అన్నారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో సమ్మె సైరన్ మోగింది. ఈనెల 16 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. మొత్తం 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మె చేపట్టాలని నిర్ణయించింది. సమ్మెకు ముందుగా శనివారం కూర్మన్నపాలెంలో భారీ రాస్తారోకో చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 7న రీజనల్ లేబర్ కమిషనర్‌తో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం సమ్మెలోకి కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్లనున్నారు
Read more:Visakhapatnam:19న అవిశ్వాస తీర్మానం