Vikarabad:కుల వివక్షను  దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్

Dr. Babu Jagajivan Ram,

Vikarabad:కుల వివక్షను  దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్:స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ  జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బిజేఅర్ చౌరస్తాలో విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ  నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఎస్సీ సంఘాల ప్రతినిధులు, అభిమానులు  పాల్గోన్నారు.

కుల వివక్షను  దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్

వికారాబాద్
స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ  జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బిజేఅర్ చౌరస్తాలో విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ  నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఎస్సీ సంఘాల ప్రతినిధులు, అభిమానులు  పాల్గోన్నారు.స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతు  చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను  దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్  బీహార్ లోని చిన్న గ్రామంలో పుట్టిన జగ్జీవన్ రామ్ గారు దేశ స్థాయిలో అత్యున్నత పదవులను అలంకరించి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో సభ్యునిగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విదంగా వ్యవహరించారు.

భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా తదుపరి వ్యవసాయ, రక్షణ శాఖలను నిర్వహించి దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగిన రికార్డు వారి సొంతం దానితో పాటుగా 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు చట్ట సభలలో సభ్యునిగా ఉండడం వరల్డ్ రికార్డు సృష్టించారు. అన్ని వర్గాల ఆదరణ, సేవాభావంతోనే వారు అన్ని దశాబ్ధాలు రాజకీయ, ప్రజా జీవితంలో కొనసాగారని  నేటి రాజకీయ నాయకులకు బాబు జగజ్జీవన్ రామ్ గారు ఆదర్శం కావాలన్నారు.
పదవులకు వన్నె తెచ్చిన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారని భారతదేశ  మొదటి కార్మిక శాఖ మంత్రిగా దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలను రూపొందించారు. తరువాత 1971 లో జరిగిన భారత్ పాక్ యుద్ద సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జగజ్జీవన్ రామ్ గారు ఇందిరాగాంధీ  ఆదేశాలకు అనుగుణంగా విజయవంతంగా సేనలను నడిపించడంతో పాటుగా బంగ్లాదేశ్ దేశ స్థాపనలో కీలక పాత్ర వహించారని తెలిపారు .1974 లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ప్రారంభించి దేశంలో ఆహార ధాన్యల కొరతకు పరిష్కారం కల్పించారు.

బాబు జగజ్జీవన్ రామ్  సూచించిన అన్ని వర్గాలకు సమ న్యాయం అనే మార్గంలోనే  రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  నాయకత్వం లోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నదన్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయి తెలిపారు .మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడి గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణి ఇవన్ని కూడా అన్ని వర్గాలకు సమంగా అందుతున్నాయి. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను, సేవలను మనమందరం గుర్తు చేసుకుని వారి మార్గంలో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాని తెలిపారు.

Read more:Vijayawada:వైసీపీకి కొత్త కష్టాలు

Related posts

Leave a Comment