Vijayawada:బెయిల్ ప్రదక్షిణలు:ఏపీలో వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందా.. ఒక్కో శాఖలో జరిగిన తప్పులను తోడుతున్నారా.. తాజాగా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ పీక్ లెవల్‌కు చేరుకున్నాయి. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో సీఐడీ విచారణ వేగవంతం చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఇటు మరో మాజీ మంత్రి కాకాణి సైతం పోలీసులకు చిక్కకుండా దోబూచులాడుతున్నారట. ఏపీలో వైసీపీ నేతలను అరెస్ట్ భయం వెంటాడుతోందనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది.
బెయిల్ ప్రదక్షిణలు
విజయవాడ, ఏప్రిల్ 5
ఏపీలో వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందా.. ఒక్కో శాఖలో జరిగిన తప్పులను తోడుతున్నారా.. తాజాగా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ పీక్ లెవల్‌కు చేరుకున్నాయి. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో సీఐడీ విచారణ వేగవంతం చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఇటు మరో మాజీ మంత్రి కాకాణి సైతం పోలీసులకు చిక్కకుండా దోబూచులాడుతున్నారట. ఏపీలో వైసీపీ నేతలను అరెస్ట్ భయం వెంటాడుతోందనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను వెతికే పనిలో పడింది కూటమి సర్కార్. ఏ నాయకుడు ఏ చిన్న తప్పు చేసినట్టు ఆధారం దొరికినా వదిలిపెట్టడం లేదు. కూపీలాగి జైల్లో కూర్చోబెడుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచి మొన్న పోసాని కృష్ణమురళి వరకు ఇదే తంతూ జరిగింది.తాజాగా ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీలో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని కూటమి సర్కార్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది.
ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచి విక్రయాలు చేసిందని ఆరోపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చి వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని లెక్కలు బయటపెడుతోంది.అయితే మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేలా ఉందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై గతేడాది సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డిని విచారించారు. ఆయన ఇచ్చిన 161 స్టేట్మెంట్ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో తనను ఎక్కడ అరెస్టు చేస్తారేమో అనే భయంతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది.మరోవైపు మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా హైకోర్టులో చుక్కెదురైంది.
సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు కసిరెడ్డి. విచారణ జరిపిన న్యాయస్థానం కసిరెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అంటూ ఒకప్పటి వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కూడా ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈకేసులో సీఐడీ వేగం పెంచుతుందనే అంచనాలు నెలకొన్నాయ్.గత ప్రభుత్వ హయాంలో భారీగా లిక్కర్ స్కామ్ జరిగిందని.. ఇది ఢిల్లీకంటే చాలా పెద్దదని టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రకటించడం..తర్వాత హోంమంత్రి అమిత్‌షాని కలవడం కూడా గుర్తుండే ఉంటుంది. తన దగ్గరున్న ఆధారాలను కూడా ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకి వివరించారు. ఈ పరిణామాలన్నీ కూడా సీఐడీ దూకుడుకు దోహదపడేలా ఉన్నాయి.ఇదిలా ఉంటే మరో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సైతం అరెస్ట్ భయంపట్టుకుదని ప్రచారం ఏపీ పాలిటిక్స్‌లో చక్కర్లు కొడుతోంది.
నెల్లూరు క్వార్జ్ అక్రమ తరలింపు కేసులో విచాణకు రావాలని మూడు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చినా.. ఆయన విచారణకు రావడం లేదు. విచారణ మాట పక్కన పెడితే అసలు కాకాణి పోలీసులకు అందుబాటులోకి రావడం లేదు.సోషల్ మీడియాలో మాత్రం తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని పోస్టులు పెడుతున్నారు. మరోసారి కార్యకర్తలకు ఫోన్ చేసి తాను నెల్లూరులోనే ఉన్నట్లు చెబుతున్నారట. ఇలా కాకాణి ఎక్కడ ఉన్నారో క్లారిటీ ఇవ్వకుండా పోలీసులతో దోబూచులాడుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న టాక్.ఏది ఏమైనా కొందరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. మరికొందరు నేతలు మాత్రం విచారణకు పిలిచినా రాకుండా తిరుగుతున్నారు. భవిష్యత్‌లో ఏపీలో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది
Read more:Donald Trump:ట్రంప్ దెబ్బకు రొయ్యలు ఫట్