Rajahmundry:ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగింది. 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. టీడీపీతో కలిపి ఆ పార్టీ బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.
జనసేన ఖాతాలోకి నిడదవోలు మున్సిపాలిటీ
రాజమండ్రి, ఏప్రిల్ 14
ఏపీలో జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ చేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం వీగింది. 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. టీడీపీతో కలిపి ఆ పార్టీ బలం 15కు చేరింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.జీరో సభ్యుల నుంచి మున్సిపాలిటీ జనసేన పరం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ చక్రం తిప్పారు. మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో నిడదవోలు మున్సిపాలిటీ పీఠం జనసేన కైవసమైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం పాలన నచ్చి వైసీపీ కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. జనసేనకు ఇక్కడ ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 స్థానాల్లో వైఎస్ఆర్ సీసీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక్క స్థానంలో టీడీపీ కౌన్సిలర్ గెలుపొందారు. కందుల దుర్గేశ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, మంత్రి కావడం జరిగింది.మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మొత్తం 13 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
మిగతా కౌన్సిలర్లు ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియోగా మంత్రి కందుల దుర్గేశ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసమైంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జనసేన ఖాతాలోకి నిడదవోలు మున్సిపాలిటీ చేరింది. మంత్రి కందుల దుర్గేశ్ రాజకీయ చతురతతో జనసేన ఈ విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 9 నెలల నుంచి నిడదవోలు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన నచ్చి 13 మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ.. 13 మంది కౌన్సిలర్లు జనసేనకు మద్దతు తెలిపారు. ఇకపై నిడదవోలు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు మంత్రి కందుల దుర్గేశ్ నిధులు తీసుకొచ్చారని చెప్పారు. మిగతా వైసీసీ కౌన్సిలర్లు కూడా త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.
Read more:Andhra Pradesh:జూన్ 12 న టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు