Nellore District:లిక్కర్ స్కాంలో రహస్యంగా విచారణ

Secret investigation into liquor scam

Nellore District:ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ప్రారంభించాయి. హైదరాబాద్‌లో అరెటా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి.  హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు.   దాడుల్లో పాల్గొంటున్న సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

లిక్కర్ స్కాంలో రహస్యంగా విచారణ

నెల్లూరు, ఏప్రిల్ 15
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ బృందాలు గాలింపు ప్రారంభించాయి. హైదరాబాద్‌లో అరెటా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేస్తున్నాయి.  హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేస్తున్నారు.   దాడుల్లో పాల్గొంటున్న సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు పాల్గొంటున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కాంపై సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ముందస్తు బెయిల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించినా విచారణకు హాజరు కావడం లేదు. ఏపీ మద్యం స్కాంలో సైలెంట్‌గా సీఐడీ సిట్  తన తాను పని చేసుకుపోతోంది. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తోంది. వారంతా కోర్టుకు వెళ్తున్నారు. కానీ హైకోర్టులో మాత్రం సానుకూల ఫలితం రావడం లేదు. ఏపీ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు.  రాజ్ కసిరెడ్డిపై  సీఐడీ ఎప్పుడో దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులను తాజాగా హైకోర్టులో సవాల్ చేశారు. తనపై దూకుడైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది.   కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి జగన్ ఐటీ సలహాదారుగా నియమించారు.  ఏపీ లిక్కర్ స్కాంపై సీఐడీ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. చాలా విషయాలు వెలుగులోకి తెచ్చిందని చెబుతున్నారు.   ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటపడుతోందని చెబుతున్నరాు. ఇప్పటికే మిథున్ రెడ్డికి ఈ స్కాంలో  ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఆయన సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు.  వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి . వైసీపీ గెలవగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. మద్యనిషేధం పేరిట దుకాణాలు తగ్గిస్తామని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా బయట దొరికే బ్రాండ్ల మద్యం మొత్తం ఏపీలో బ్యాన్ చేశారు. కేవలం కొన్ని కంపెనీలు.. అది కూడా ఏపీ లోనే మద్యం అమ్మే కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. అవన్నీ వైసీపీ నేతలవన్న ఆరోపణలు ఉన్నాయి.  టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిపై దర్యాప్తు ప్రారంభించింది.

ఈడీ కూడా విచారణ చేయాలని సిఫారసు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ లో ఏపీ సిట్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నాయి. రాయదుర్గం పోలీసుల సాయంతో అరెటా ఆసుపత్రిలో ఏపీ సిట్ బృందాలు సోదాలు చేశాయి. రాజ్ కసిరెడ్డి కుటుంబసభ్యులు అరెటా ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్నారు. విచారణకు హాజరుకాకుండా కసిరెడ్డి హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది.ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు గుర్తించాయి. జూబ్లీహిల్స్ తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ లో ఏపీ సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఎల్ఓసీ ఇచ్చారు ఏపీ పోలీసులు. సిట్ విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు రాజ్ కసిరెడ్డి. జూబ్లీహిల్స్ లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి ఏపీ సిట్ బృందం నోటీసులు అంటించనుంది.

Read more:Andhra Pradesh:వక్ఫో బోర్డుపై సుప్రీంకు వైసీపీ. తప్పు పట్టిన బీజేపీ

Related posts

Leave a Comment