Mumbai:బాలీవుడ్ హీరో మనోజ్ కుమార్ మృతి

Bollywood hero Manoj Kumar passes away

Mumbai:బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ఈ ఉదయం కన్నుమూశారు. 87 ఏళ్ల మనోజ్ కుమార్ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మనోజ్ కుమార్ మరణంపై బాలీవుడ్‌ తీవ్ర విచారం వ్యక్తంచేస్తోంది. ప్రముఖ నటుడి మరణం అభిమానులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మనోజ్ కుమార్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు.

బాలీవుడ్ హీరో మనోజ్ కుమార్ మృతి

ముంబై, ఏప్రిల్ 4
బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ఈ ఉదయం కన్నుమూశారు. 87 ఏళ్ల మనోజ్ కుమార్ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మనోజ్ కుమార్ మరణంపై బాలీవుడ్‌ తీవ్ర విచారం వ్యక్తంచేస్తోంది. ప్రముఖ నటుడి మరణం అభిమానులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.మనోజ్ కుమార్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. మనోజ్ కుమార్ తన దేశభక్తి చిత్రాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన బాలీవుడ్‌లో ‘భరత్ కుమార్’గా పిలుస్తారు.మనోజ్ కుమార్ మరణంపై చిత్రనిర్మాత అశోక్ పండిట్ మాట్లాడుతూ, “… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మా ప్రేరణ, భారత చలనచిత్ర పరిశ్రమకు ‘సింహం’ మనోజ్ కుమార్ మనతో లేరు.

ఇది పరిశ్రమకు భారీ నష్టం ” అని అన్నారు. జూలై 24, 1937న హరికృష్ణ గిరి గోస్వామిగా జన్మించిన మనోజ్ కుమార్ హిందీ చిత్రసీమలోకి ప్రవేశించి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అతను “షహీద్” (1965), “ఉప్కార్” (1967), “పురబ్ ఔర్ పశ్చిమ్” (1970), “రోటీ కప్డా ఔర్ మకాన్” (1974) వంటి దేశభక్తి ఇతివృత్తాలతో కూడిన చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా చేశారు. ఈ సినిమాల కారణంగా ఆయనను ‘భరత్ కుమార్’ అని కూడా పిలిచేవారు.దేశభక్తి చిత్రాలే కాకుండా, “హరియాలీ ఔర్ రాస్తా”, “వో కౌన్ థీ”, “హిమాలయ్ కి గాడ్ మే”, “దో బదన్”, “పత్తర్ కే సనమ్”, “నీల్ కమల్” “క్రాంతి” వంటి ఇతర ముఖ్యమైన చిత్రాల్లో నటించాడు, దర్శకత్వం వహించాడు. 1995లో ‘మైదాన్-ఎ-జంగ్’ చిత్రం ఆయన నటించిన చివరి సినిమా.
అవార్డులు, గౌరవాలు
మనోజ్ కుమార్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.

Read more:Visakhapatnam:రామానాయుడు స్టూడియో స్వాధీనం

Related posts

Leave a Comment