Hyderabad: సుహాసినికే టీడీపీ పగ్గాలు

suhasini

Hyderabad: సుహాసినికే టీడీపీ పగ్గాలు:తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలి అన్నది చంద్రబాబుప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక వేస్తున్నారు. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే.. నందమూరి కుటుంబాన్ని కొలుపుకేల్లాలని భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటు వెండితెరను సైతం ఏలింది ఆ కుటుంబం.

సుహాసినికే టీడీపీ పగ్గాలు

హైదరాబాద్, ఏప్రిల్ 2
తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలి అన్నది చంద్రబాబుప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక వేస్తున్నారు. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే.. నందమూరి కుటుంబాన్ని కొలుపుకేల్లాలని భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. అటు వెండితెరను సైతం ఏలింది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అదే ఆ కుటుంబ అభిమానులకు లోటు. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబం ప్రాతినిధ్యం పెరగాలన్నది వారి నుంచి వస్తున్న డిమాండ్. అయితే దీనిని పరిగణలోకి తీసుకున్నారట చంద్రబాబు. అందుకే నందమూరి కుటుంబానికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటి సమసి పోతుండగా.. తామంతా ఒక్కటేనని చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తో హల్చల్ చేశారు. అది మరవక ముందే నందమూరి కళ్యాణ్ రామ్ టిడిపి జెండా చేత పట్టుకొని సందడి చేశారు.

తద్వారా విభేదాలు అన్నవి ఊహాగానాలే తప్ప.. నిజం కాదని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు.గత కొద్దిరోజులుగా నందమూరి యువ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సైతం వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి ప్రస్తావన కూడా తేవడానికి ఆయన ఇష్టపడడం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరిపోయాయి అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. బాల బాబాయ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ రామ్ అయితే తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీని మరో 50 ఏళ్ల పాటు ముందుకు తీసుకెళ్లాలి అన్నది చంద్రబాబు ప్లాన్. తన వయసు రీత్యా ఆయన భవిష్యత్తు ప్రణాళిక వేస్తున్నారు. నారా లోకేష్ ను ప్రమోట్ చేస్తూనే.. నందమూరి కుటుంబాన్ని కొలుపుకేల్లాలని భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారు చంద్రబాబు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. వారిని ఇబ్బంది కలిగించకుండా నందమూరి కుటుంబాన్ని ఉపయోగించుకోవాలన్నదే చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.

తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. అప్పటినుంచి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు పదవి ఖాళీగా ఉంది. ఆ పదవిని నందమూరి కుటుంబానికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆమె 2018 ఎన్నికల్లో టిడిపి తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. అందుకే ఆమెకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నందమూరి కుటుంబాన్ని కలుపుతున్నట్లు సంకేతాలు ఇవ్వనున్నారట చంద్రబాబు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Read more:Stunning View of India from Space – Sunita Williams Shares Her Experience

Related posts

Leave a Comment