Hyderabad:లవ్ స్టోరీలో బాలయ్య:మన టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీయాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణికం, జానపదం వంటి జానర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పట్లో తియ్యడం లేదు కానీ, పాత రోజుల్లో ఫ్యామిలీ డ్రామాస్ తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టిన చరిత్ర ఆయనది. అలా అన్ని జానర్స్ లో మెప్పించిన బాలయ్య లవ్ స్టోరీ జానర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు.
లవ్ స్టోరీలో బాలయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 8
మన టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీయాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాదు, పౌరాణికం, జానపదం వంటి జానర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. ఫ్యామిలీ స్టోరీస్ ఇప్పట్లో తియ్యడం లేదు కానీ, పాత రోజుల్లో ఫ్యామిలీ డ్రామాస్ తో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టిన చరిత్ర ఆయనది. అలా అన్ని జానర్స్ లో మెప్పించిన బాలయ్య లవ్ స్టోరీ జానర్ లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదు. అదే విధంగా కామెడీ జానర్ లో కూడా ఆయన ఇది వరకు సినిమాలు చేయలేదు. అసలు బాలయ్య తో ఈ జానర్స్ లో సినిమాలు తీయాలనే ఆలోచన ఎవరికీ రాదేమో. ఎందుకంటే ఆయనకీ ఉన్న మాస్ ఇమేజ్ అలాంటిది. అయితే బాలయ్య ఎలాంటి జానర్ లో అయినా అద్భుతంగా నటించగలడు అని అనేక అందర్భాల్లో రుజువు అయ్యింది.ముఖ్యంగా ఆయనలో హోస్టింగ్ చేసే టాలెంట్ ఉందని ఎవరైనా ఊహించారా?, అన్ స్టాపబుల్ షోలో అద్భుతమైన హోస్టింగ్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. బాలయ్య లో ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు మన స్టార్ హీరోలందరూ పలు షోస్ కి హోస్ట్ గా వ్యవహరించారు.
అందరికంటే బెస్ట్ హోస్ట్ ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని బాలయ్య పేరు చెప్పొచ్చు. ఆ రేంజ్ హోస్టింగ్ చేశాడు ఆయన. అలా అన్ స్టాపబుల్ చూసిన తర్వాత బాలయ్య కి సాధ్యం కానిది అంటూ ఏది లేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక డైరెక్టర్ బాలయ్య బాబు తో ఒక లవ్ స్టోరీ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయన బాలయ్య బాబు ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ని చెప్పాడట.స్టోరీ విన్న తర్వాత బాలయ్య ఇలాంటి కథలు మన బాడీ కి సూట్ అవ్వవు, నేను యంగ్ వయస్సులో ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు నా అభిమానులు అంగీకరించేవాళ్ళు కాదు, ఇప్పుడు నా వయస్సు 64 ఏళ్ళు, ఇప్పుడు లవ్ స్టోరీస్ తీస్తే చూస్తారా?, నా మాట విని మంచి మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చెయ్యి అన్నాడట. కానీ డైరెక్టర్ మాత్రం లవ్ స్టోరీ నే చేద్దామని అంటున్నాడట. ఈ ప్రేమకథకు వయస్సు తో సంబంధం లేదని, బాలయ్య వయస్సు కు తగ్గట్టుగానే స్టోరీ ని డిజైన్ చేసాడని అంటున్నారు. ఇంతకు బాలయ్య కి కథ ని వినిపించిన డైరెక్టర్ మరెవరో కాదు, హరీష్ శంకర్అని టాక్ విన్పిస్తుంది. రీసెంట్ గానే ఆయన బాలయ్య తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అందులో భాగంగానే ఈ స్టోరీ ని వినిపించి ఉంటాడని అంటున్నారు ఫ్యాన్స్.
Read more:Hyderabad:మళ్లా ఆగిన కేబినెట్ విస్తరణ