Hyderabad:పోలీసుల పేరుతో టిక్కెట్ల స్కామ్

Secretary Dev Raj and Treasurer Srinivas and inquired about the misuse of tickets.

Hyderabad:ఉప్పల్ స్టేడియం లో విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్ రాజ్ ,ట్రెజరర్ శ్రీనివాస్ తో సమావేశం అయి టిక్కెట్ల దుర్వినియోగం  పై ఆరా తీశారు. శనివారం ఉప్పల్లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియను ఎలా చేస్తున్నారన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్ లపై ఆరోపణలు వచ్చాయి. 

పోలీసుల పేరుతో టిక్కెట్ల స్కామ్

హైదరాబాద్, ఏప్రిల్ 13
ఉప్పల్ స్టేడియం లో విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవ్ రాజ్ ,ట్రెజరర్ శ్రీనివాస్ తో సమావేశం అయి టిక్కెట్ల దుర్వినియోగం  పై ఆరా తీశారు. శనివారం ఉప్పల్లో మ్యాచ్ ఉండడంతో టికెట్ల పంపకం ప్రక్రియను ఎలా చేస్తున్నారన్న దానిపై వివరాలు తెలుసుకున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సెక్రటరీ, ట్రెజరర్ లపై ఆరోపణలు వచ్చాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి వచ్చే ప్రతి కాంప్లిమెంటరీ టికెట్ మొదటగా చేరుకునేది వీళ్లిద్దరు వద్దకే కాబట్టి వీరిద్దరి నుండే టికెట్టు పక్కదారు పట్టినట్టు భావిస్తున్నారు విజిలెన్స్ అధికారులుస్టేడియంలో కార్ పాసులు, బైక్ పాసులు తన సొంత మనుషులకే జారీ చేస్తున్నట్టు అభియోగాలు ఉన్నాయి. కాంప్లిమెంటరీ టికెట్లు చాలావరకు పక్కదారి పట్టినట్లు భావిస్తున్న విజిలెన్స్ అధికారులు ఈ దిశగా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీ విషయంలో కీలకపాత్ర వహిస్తున్న సెక్రటరీ దేవరాజ్ ట్రెజరర్ శ్రీనివాస్ గురించి పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి.

ఒప్పందం ప్రకారం 10% కాంప్లిమెంటరీ టికెట్లు హెచ్సీఏ కి వస్తున్నా… సన్ రైజర్స్  వాళ్ళు తక్కువగా ఇస్తున్నారు అంటూ బయట ప్రచారం చేసి.. తమ వర్గానికి టికెట్లను పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. రాచకొండ పోలీసులు ఎక్కువ మొత్తంలో టికెట్లు తీసుకుంటున్నారంటూ బయట ప్రచారం చేసిన సెక్రటరీ వ్యవహారాన్ని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మ్యాచ్ లు జరుగుతున్న విధి నిర్వహణలో పోలీసులు ఉంటారు. వారికి పాసులు ఇవ్వరు. అవి కాకుండా ఎవరికైనా పాసులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇస్తారు కానీ పోలీసు శాఖ కోసం ఇవ్వరు. ఈ విషయంలోనూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆరా తీసి.. అక్రమాలను బయట పెట్టి  కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉచిత టిక్కెట్ల కోసం వేధింపులు పెరిగిపోయాయని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం యాజమాన్యం ఆరోపణలు చేసింది.

ఈ వివాదం విషయంలో సీఎం రేవంత్ విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు.  ఆ తర్వాత హెచ్‌సీఏ, ఎస్ఆర్‌హెచ్ ఓ ఒప్పందానికి వచ్చాయి.  ఒప్పందానికి వ్యతిరేకంగా ఎలాంటి చిన్న పనిచేయాలని అడగబోమని రాసిచ్చారు.    బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్‌, హెచ్‌సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేర‌కు ప‌ని చేసేందుకు ఇరు వ‌ర్గాలు అంగీకారం తెలుపుతూ ఓ నిర్ణయం తీసుకున్నారు.  పాత ఒప్పందం ప్ర‌కార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం  కాంప్లిమెంట‌రీ పాసుల కేటాయిస్తారు. అంతే తప్ప.. ఇక హెచ్‌సీఏ అధ్యక్షుడు బ్లాక్ మెయిల్ చేశారని వేరే బాక్సులు.. ఇతర టిక్కెట్లు ఇచ్చే చాన్స్ లేదని ఎస్ఆర్‌హెచ్ స్పష్టం చేసింది. ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది.  చర్చలు పూర్తయిన తరవాత  వివాదాల‌న్ని ముగిశాయని  హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ సంయుుక్తంగా ప్రకటించాయి.

Read also:Telangana:10 లక్షలు.. గులాబీ ప్లాన్   

Related posts

Leave a Comment