Hyderabad:క్లైమాక్స్‌కు  విస్తరణ  ఎపిసోడ్‌

Telangana cabinet expansion episode has finally reached its climax.

Hyderabad:క్లైమాక్స్‌కు  విస్తరణ  ఎపిసోడ్‌:తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్‌ ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే క్యాబినెట్ విస్తరణ వేళ మంత్రుల పోర్టుఫోలియోల్లో కూడా మార్పులు తప్పవంటూ ఒక చర్చ పొలిటికల్‌ సర్కిళ్ల చక్కర్లుకొడుతోంది. కొందరు మంత్రులు సైతం తమ శాఖలను మార్చాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. మరోవైపు మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు తథ్యమని బలమైన టాక్ గాంధీభవన్‌లో వినిపిస్తోంది.

క్లైమాక్స్‌కు  విస్తరణ  ఎపిసోడ్‌

హైదరాబాద్, ఏప్రిల్ 2,
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఎపిసోడ్‌ ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే క్యాబినెట్ విస్తరణ వేళ మంత్రుల పోర్టుఫోలియోల్లో కూడా మార్పులు తప్పవంటూ ఒక చర్చ పొలిటికల్‌ సర్కిళ్ల చక్కర్లుకొడుతోంది. కొందరు మంత్రులు సైతం తమ శాఖలను మార్చాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. మరోవైపు మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు తథ్యమని బలమైన టాక్ గాంధీభవన్‌లో వినిపిస్తోంది. ఐతే ఎవరెవరి శాఖలు మారుతాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సామాజిక సమీకరణలంటూ నేతలు ట్విస్ట్‌ ఇస్తే.. పోర్టుఫోలియోలో ఛేంజేస్‌ అంటూ హైకమాండ్ రివర్స్‌ షాక్ ఇస్తోంది. మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌తో పాటు ప‌నితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్ ఫోలియోలు కూడా మారుస్తామంటూ అధిష్టానం లీకులు ఇస్తోందనేది గాంధీభవన్‌లో వినిపిస్తోన్న గాసిప్.చాలాకాలంగా పెండింగ్ పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కన్‌క్లూజన్‌కు వచ్చేసింది. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఇప్పటికే రాజ్‌భవన్‌కు ప్రభుత్వవర్గాలు సమాచారమిచ్చాయట.

ఇదిలా ఉంటే మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌తో పాటు ప‌నితీరు ఆధారంగా మంత్రుల పోర్ట్‌ఫోలియోలు కూడా మారుస్తారనే ప్రచారం మొదలైంది.. ప్రస్తుతం ఉన్న శాఖ‌ల‌తో పాటు సీఎం దగ్గరున్న శాఖ‌ల‌ను కేటాయించే విష‌యంపై కూడా అధిష్టానం దగ్గర చ‌ర్చ జ‌రిగింద‌ట‌.మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో నాలుగింటిని భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. కొత్తగా నలుగురు మంత్రులు వచ్చి చేరాక .. శాఖల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. అయితే పాత మంత్రులు కొందరు తమ శాఖలను మార్చాలని కోరుతుండగా.. మరోవైపు సీఎం సైతం పనితీరు ఆధారంగా శాఖల మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట ముఖ్యమంత్రి. ఇదే విషయంపై సహచర మంత్రులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇండికేషన్ కూడా ఇచ్చారట.శాఖల విషయంలో కొందరు మంత్రులు కాస్త అసంతృప్తిగా ఉన్నారని గాంధీభవన్‌లో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా ఆర్థికశాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన శాఖను మార్చాలని కోరుతున్నారట. ఈ మధ్య కాలంలో ఫైనాన్స్ బిల్లులకు సంబంధించి పొలిటికల్ సర్కిళ్లలో రకరకాల చర్చలకు దారి తీస్తోంది. ఏకంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కమిషన్ల ప్రభుత్వమని.. బిల్లులు క్లియర్ చేయడానికి ఆర్థికశాఖ 20శాతం కమిషన్ తీసుకుంటుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎక్కువ అవుతుండటంతో.. ఆర్థికశాఖ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారట భట్టి.

అందుకే ఈ శాఖ మరెవరికైనా ఇవ్వాలని కోరుతున్నారట.ఇక ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తన శాఖ మార్చాలని హైకమాండ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారట. అలాగే వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ సైతం తనకు శాఖ మార్చి విద్యాశాఖను ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు పొంగులేటి దగ్గర ఉన్న శాఖల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.ఇక ఇద్దరు మహిళా మంత్రులు సైతం తమ శాఖల్ని మార్పులు చేయాలని కోరుతున్నారట. మంత్రి సీతక్క తనకు ట్రైబల్ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ కావాలని కోరుతున్నారు. ఒక ఎస్టీ మహిళగా తమ వర్గానికి చెందిన శాఖను ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నారు. మరో మహిళా మంత్రి కొండా సురేఖ సైతం తన దగ్గర ఉన్న దేవదాయ, అటవీశాఖ కాకుండా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కావాలని కోరుతున్నారట.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొండా సురేఖకు ఈ శాఖ చేసిన అనుభవం ఉంది. అందుకే ఈ శాఖ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అమాత్య బెర్తులు కన్ఫామ్‌ అని కాన్ఫిడెంట్‌గా ఉన్న వారు సైతం శాఖల విషయంలో ముఖ్యమంత్రికి తమ ఆలోచనలను చెప్పారట. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు హోంశాఖ కావాలని బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు శాఖల పనితీరు.. కొందరు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. శాఖల మార్పులు చేర్పులు చేయాలని సీఎం రేవంత్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారట. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాత, కొత్త వారికి శాఖల కేటాయింపుల సందర్భంగా మార్పులు, చేర్పులు ఖాయమనే చర్చ జరుగుతోంది.తెలంగాణ క్యాబినెట్ విస్తర‌ణ అంశం తుదిద‌శ‌కు వ‌చ్చిన‌ప్పటికీ ఎవ‌రి ప్రయ‌త్నాలు వారు చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ఛాన్స్ కొట్టేసేందుకు కొంద‌రు ట్రై చేస్తుంటే.. మంత్రిగా బెర్త్‌ క‌న్ఫామ్ అయినవారు శాఖ‌ల‌పై దృష్టి పెట్టారు. మ‌రోవైపు సీనియర్ మంత్రులు కూడా త‌మ శాఖ‌లు మార్చాలని కోరుతున్నారు. ఎవ‌రి ప్రయ‌త్నాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంద‌నేది వేచి చూడాలి.

Read more:Lucknow: యోగి వర్సెస్ స్టాలిన్.

Related posts

Leave a Comment