Donald Trump:ట్రంప్ దెబ్బకు రొయ్యలు ఫట్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అమెరికాకు మనదేశం నుంచి కొన్ని కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. ట్రంప్ వీటిపై కూడా 27.83 శాతం సుంకాలు అమలు చేసే అవకాశం ఉంది.దీంతో అమెరికాలో రొయ్యల ధర పెరుగుతుంది. మనదేశం నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో ఇక్కడ రొయ్యల ధరలు తగ్గుతాయి. దీంతో రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయం తగ్గుతుంది.
ట్రంప్ దెబ్బకు రొయ్యలు ఫట్
ఏలూరు, ఏప్రిల్ 5
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 26 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అమెరికాకు మనదేశం నుంచి కొన్ని కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. ట్రంప్ వీటిపై కూడా 27.83 శాతం సుంకాలు అమలు చేసే అవకాశం ఉంది.దీంతో అమెరికాలో రొయ్యల ధర పెరుగుతుంది. మనదేశం నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో ఇక్కడ రొయ్యల ధరలు తగ్గుతాయి. దీంతో రొయ్యల వ్యాపారంలో ఉన్న వారి ఆదాయం తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం అప్పుడే పడింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో రొయ్యల ధర రూ.40కి దిగజారింది. మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు.ఇక్కడ ప్రతి ఏడాది 4 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది. అందులో ఏకంగా, 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో దీనిపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం 100 కౌంట్ రొయ్య ధర కిలో రూ.240. ఆ మరుసటి రోజే రూ.200కి పడిపోయింది.మామూలుగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలనే యూఎస్‌కు పంపుతారు. ట్రంప్ విధించిన సుంకాలను వంకలుగా చూపిస్తూ వాటిపై గరిష్ఠంగా కిలోకు రూ.30-40 వరకు తగ్గించడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు
Read more:Visakhapatnam:స్టీల్ ప్లాంట్ నుంచి 3,823 ఉద్యోగులు తొలగింపు సమ్మెకు సిద్ధమౌతున్న కార్మిక సంఘాలు