Chennai:చెన్నై డైరక్టర్లకు ఏమైంది:ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. బాలీవుడ్ హీరోలను డామినేట్ చేస్తూ మన హీరోలు వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఇక రాజమౌళి ప్రభాస్ చేసిన బాహుబలి( సినిమాతో తెలుగు సినిమా స్థాయి అనేది అమాంతం పెరిగింది. ఇప్పటివరకు ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా వచ్చినా కూడా తెలుగు సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులను బ్రేక్ చేయలేకపోతున్నాయి.
చెన్నై డైరక్టర్లకు ఏమైంది
చెన్నై, ఏప్రిల్ 11
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోల హవా ఎక్కువైపోయింది. బాలీవుడ్ హీరోలను డామినేట్ చేస్తూ మన హీరోలు వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్లకంటు ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టారు. ఇక రాజమౌళి ప్రభాస్ చేసిన బాహుబలి( సినిమాతో తెలుగు సినిమా స్థాయి అనేది అమాంతం పెరిగింది. ఇప్పటివరకు ఏ ఒక్క పాన్ ఇండియా సినిమా వచ్చినా కూడా తెలుగు సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులను బ్రేక్ చేయలేకపోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు కూడా మన హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి మన హీరోలు వాళ్ళ కథలు నచ్చితే ఇతర భాషల్లో ఉన్న దర్శకులకు అవకాశాలను ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ దర్శకులకు ఎక్కువగా అవకాశాలను ఇస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక ఈ మధ్యకాలంలో మన హీరోలతో తమిళ్ దర్శకులు చేసిన సినిమాలేవి కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాయి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్రోని సినిమాని తమిళ్ డైరెక్టర్ అయిన సముద్ర ఖనిడైరెక్ట్ చేశాడు.ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక దాంతోపాటుగా రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా కూడా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడమే కాకుండా రామ్ చరణ్ కు బ్యాడ్ నేమ్ కూడా తీసుకొచ్చింది…మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుంది. అల్లు అర్జున్ కెరీయర్ ను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది. ఆయనకి ఇండియా సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టాండర్డ్ అయితే ఉంది. మరి ఆ స్టాండర్డ్ ని అందుకొని ఈ సినిమా ముందుకు సాగుతుందా లేదంటే బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొడుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమా తొందర్లోనే రెగ్యులర్ షూట్ జరుపుకోబోతుంది అనే హింటు కూడా ఇచ్చారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. పుష్ప 2 సినిమాను మించి భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
Read more:Mumbai: ఎన్ ఐఏ అధికారుల అదుపులో రాణా