Andhra Pradesh:19వతేదీన ఏం జరగబోతోంది.. విదేశీ టూర్ లలో కార్పొరేటర్లు

Politics is getting intresting in the Steel City.

Andhra Pradesh:స్టీల్ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చేజారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. 74వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు.

 19వతేదీన ఏం జరగబోతోంది..
విదేశీ టూర్ లలో కార్పొరేటర్లు

విశాఖపట్టణం, ఏప్రిల్ 15
స్టీల్ సిటీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీకి విశాఖలో మరో షాక్ తగిలింది. ఊహించినట్లుగానే ఆ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒక్కరొక్కరుగా చేజారిపోతున్నారు. తాజాగా వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశి జనసేన గూటికి చేరారు. మాజీ మంత్రి జనసేన నాయకుడు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. 74వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతున్న వంశీ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు.తిప్పలనాగిరెడ్డి తొలి నుంచి వార్డు అభివృద్ధిపై తమకు నిధులు కేటాయించడం లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారంట. నిధుల కేటాయింపు విషయమై వంశీ కౌన్సిల్ సమావేశాల్లో పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐనా ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో చివరకు పార్టీ మారాలని నిర్ణయించుకొని జనసేనలో చేరిపోయారు.

వంశీ జనసేనలో చేరడంతో గ్రేటర్ పీఠం కూటమి కైవసం చేసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సమయం దగ్గర పడుతుండడంతో నగరంలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఈనెల 19న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. దీంతో కొద్దిరోజులుగా క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం దక్కించుకుంటామని టిడిపి బలంగా చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పదవిని నిలుపుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. రెండు పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. కొంతమంది కార్పొరేటర్లను విదేశాలకు తరలించినట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. అయితే మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 74 మంది సభ్యుల అవసరంకాగా..ఇప్పటికే కూటమికి 70 మంది సభ్యులు సహకారం ఉంది.వీరితో పాటు మరో ఐదుగురు వైసీపీ సభ్యులు తమతో టచ్ లో ఉన్నారని పలు సందర్భాల్లో కూటమి నేతలు చెబుతున్నారంట. దీనికి తగ్గట్టుగానే వంశీ పార్టీ మారడంతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ స్టార్ట్ అయిందట. దీంతో కార్పొరేటర్లు జారిపోకుండా శ్రీలంకలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

అటు కూటమి సైతం మలేసియాలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జనసేన సైతం కౌలాలంపూర్ లో స్పెషల్ క్యాంపును ఏర్పాటు చేసిందట. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. 98 డివిజన్లు ఉన్న గ్రేటర్ విశాఖలో..58 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. టిడిపి 29 స్థానాలకు పరిమితం అయింది. జనసేన మూడు చోట్ల గెలిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలామంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరారు. టీడీపీతో పాటు జనసేనలోకి అధిక సంఖ్యలో చేరడంతో కూటమి బలం పెరిగింది.దీనికి తోడు కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ఉన్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా వారు సైతం ఓటింగ్ కు వచ్చే అవకాశం ఉంది. అయితే వైసీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చాలామంది కార్పొరేటర్లు..ముఖం చాటేస్తున్నారంట. బహిరంగంగానే తాము కూటమికి మద్దతు తెలుపుతామని కొంతమంది చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈనెల 19న జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో కూటమి నెగ్గడం ఖాయమనే చర్చ నడుస్తోంది. మరి 19న జరిగే అవిశ్వాస తీర్మానంతో విశాఖ నగర పొలిటికల్ సీన్ మారుతుందా లేదా? ఆ రోజు అసలేం జరుగుతుందో చూడాలి.

Read more:Nellore District:లిక్కర్ స్కాంలో రహస్యంగా విచారణ

Related posts

Leave a Comment