Andhra Pradesh: సినిమాల్లోకి దువ్వాడ.

Duvvada Srinivas-Madhuri.. No matter what Telugu news channel or YouTube channel you watch, the buzz about these two is not all that great.

Andhra Pradesh: సినిమాల్లోకి దువ్వాడ.:దువ్వాడ శ్రీనివాస్-మాధురి.. ఏ తెలుగు న్యూస్ ఛానెల్ చూసినా, యూట్యూబ్ ఛానెల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికెత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని అనడం, అందులోనూ నగ్మాతో పోల్చడం.. ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం.. అబ్బో ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూల్లో చాలానే ఉన్నాయి.

సినిమాల్లోకి దువ్వాడ.

శ్రీకాకుళం, ఏప్రిల్ 4
దువ్వాడ శ్రీనివాస్-మాధురి.. ఏ తెలుగు న్యూస్ ఛానెల్ చూసినా, యూట్యూబ్ ఛానెల్ చూసినా వీరిద్దరి సందడి అంతా ఇంతా కాదు. మాధురి ఎపిసోడ్ కి టాప్ రేటింగ్స్ రావడంతో అప్పట్నుంచి ఆమెను మీడియా నీడలా అనుసరిస్తోంది. మాధురిని ఆకాశానికెత్తేయడం, ఆమెను హీరోయిన్ లా ఉన్నారని అనడం, అందులోనూ నగ్మాతో పోల్చడం.. ఆమెతో క్యాట్ వాక్ చేయించడం, పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం.. అబ్బో ఇలాంటి సీన్స్ ఇంటర్వ్యూల్లో చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మాధురి.మాధురికి చాలా క్వాలిఫికేషన్లు ఉన్నాయని పొలిటీషియన్, వుమన్ ఎంటర్ ప్రెన్యూర్, ఇన్ ఫ్లూయెన్సర్, ఫైర్ బ్రాండ్.. ఇలా చాలా ఉన్నాయని, సినిమా హీరోయిన్ కూడా అందులో యాడ్ అవుతోందని యాంకర్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. మాధురి కూడా తనకు చిన్నప్పటినుంచి యాక్టింగ్ అంటే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, గతంలో తనకు టైమ్ దొరకలేదని, ఛాన్స్ దొరకలేదని.. టైమ్ వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు మాధురి.మాధురి తనకు సినిమాల్లోకి వెళ్లాలనుంది అని అనగానే, పక్కనే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఊరుకుంటారా..? ఆయన కూడా మాధురి టాలెంట్ ని బయటపెట్టారు. పాటలు పాడటం కంటే కంటే ఆమె డ్యాన్స్ బాగా చేస్తుందని చెప్పుకొచ్చారు. భరతనాట్యంలో ఆమెకు ప్రవేశం ఉందన్నారు. నెమలికి నేర్పిన నడకలివీ అనే పాటతోపాటు, చాలా పాటలకు ఆమె అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుందన్నారు.

గతంలో దువ్వాడ కూడా మాధురిని అడిగి మరీ కొన్ని పాటలకు డ్యాన్స్ వేయించుకునేవారట.దువ్వాడ శ్రీనివాస్ తనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, ఆయనే తనకు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆయన సినిమాల్ని తాను చూస్తుంటానని, హోమ్ థియేటర్లో ఆయన సినిమాలు చూస్తానన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు తాను థియేటర్లకు వెళ్తుంటానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తాను అభిమానిస్తానని, అయితే తాను సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. కార్ లో సీనియర్ ఎన్టీఆర్ పాటలు పెట్టుకుంటారని, అప్పుడప్పుడు ఆ పాటలకు అర్థాలు తనకు చెబుతుంటారని కోరస్ ఇచ్చారు మాధురి.శ్రీనివాస్ కి కూడా సినిమాలంటే బాగా ఇష్టం. ఆమధ్య మాధురి నిర్మాతగా ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించినట్టు వార్తలొచ్చాయి. నటించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి. ఇక మాధురి కూడా తన యాక్టింగ్ పెర్ఫామెన్స్ ని వెండితెరపై చూపించాలనుకుంటున్నారు. ఫైనల్ గా వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందేమోనని అనిపిస్తోంది. దువ్వాడ-మాధురి కాంబినేషన్ ఇప్పటికే బుల్లితెరపై, యూట్యూబ్ లో సూపర్ హిట్ అయింది. వీరి ప్రోగ్రామ్ లకు మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇక వీరు సినీరంగంలోకి వెళ్తే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. షార్ట్ ఫిల్మ్ ల వరకు ఓకే, వెండితెరపై కనపడాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న పని, దానికి దువ్వాడ సిద్ధపడతారా..? మాధురి తెరంగేట్రానికి తానే నిర్మాత అవుతారా..? వేచి చూడాలి.

Read more:నిత్యానంద చనిపోలేదు: కైలాస దేశం ప్రకటన

Related posts

Leave a Comment