Andhra Pradesh:గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. కొంత మందిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయనున్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రేషనలైజేషన్ వ్యతిరేకించకపోయినా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని జీవో నెంబర్ 3ను విడుదల చేశారు.
సచివాలయ ఉద్యోుగల రేషనలైజేషన్
గుంటూరు, ఏప్రిల్ 12
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. కొంత మందిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయనున్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రేషనలైజేషన్ వ్యతిరేకించకపోయినా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు.గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని జీవో నెంబర్ 3ను విడుదల చేశారు. అందులో ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన కోసం.. ఉద్యోగుల విభజన చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లు పాటించాలని సూచించారు.ఫంక్షనరీల రేషనలైజేషన్, జిల్లాల వారీ గ్రామ/వార్డు సచివాలయాల జాబితాలు, జనరల్ పర్పస్ ఫంక్షనరీలను నియమించాల్సిన హోదాల మార్గదర్శకాలకు జత చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ తదనుగుణంగా అవసరమైన చర్య తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయా (11,162 గ్రామ, 3,842 వార్డు సచివాలయాలు)ల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు.
3 రకాలుగా వర్గీకరణ:
గ్రామ/వార్డు సచివాలయాలలో పనిచేసే ఫంక్షనరీస్‌ను ప్రభుత్వం మూడు కేటగిరీలు వర్గీకరించింది. సేవలు, పథకాలను సమర్థవంతంగా, రియల్ టైమ్‌లో అందించడం, కార్యక్రమాల అమలు కోసం వర్గీకరణ చేపట్టింది. 1. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ (జనరల్ పర్పస్), 2. టెక్నికల్ ఫంక్షనరీస్ (స్పెసిఫిక్ పర్పస్), 3.యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించింది.
1.జనరల్ పర్పస్ ఫంక్షనరీస్:
ఎ.గ్రామ సచివాలయం- పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ I-V), డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్.
బి.వార్డు సచివాలయం- వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీస్.
2.స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్:
ఎ. గ్రామ సచివాలయం- వీఆర్‌వో, ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్/ హార్టికల్చర్/ సెరికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ/ ఫిషరీష్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్.
బి.వార్డు సచివాలయం- వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ.
3.యాస్పిరేషనల్ ఫంక్షనరీస్:
నియమించబడే ఫంక్షనరీల్లో ఒకరిని గ్రామ / వార్డు సచివాలయాలలో యాస్పిరేషనల్ ఫంక్షనరీస్‌గా నియమిస్తారు.
జనాభా ప్రాతిపదికన..
2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగా, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బీ కేటగిరీగా, 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉంటే సీ కేటగిరీగా విభజించారు. ఆ మేరకు సచివాలయ సిబ్బందిని కుదించారు.
2,500 మంది జనాభా ఉన్న సచివాలయానికి (ఏ కేటగిరీ) ఆరుగురు (మల్టీపర్పస్ ఫంక్షనరీస్-2, టెక్నికల్ ఫంక్షనరీస్-4), 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయానికి (బీ కేటగిరీ) ఏడుగురు (మల్టీపర్పస్ ఫంక్షనరీస్-3, టెక్నికల్ ఫంక్షనరీస్-4), 3,501 కంటే ఎక్కువగా జనాభా ఉన్న సచివాలయానికి (సీ కేటగిరీ) ఎనిమిది మంది (మల్టీపర్పస్ ఫంక్షనరీస్-4, టెక్నికల్ ఫంక్షనరీస్-4) కేటాయించారు.
1. ఏ కేటగిరీ (2,500 జనాభా వరకు:
ఏ. గ్రామ సచివాలయం- 1. పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ 2, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్.
బి.వార్డు సచివాలయం- 1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ. 2. వార్డు వెల్ఫేర్ అండ్ డవలప్‌మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీస్.
2. బీ కేటగిరీ (2,501 నుంచి 3,500 జనాభా వరకు:
ఏ. గ్రామ సచివాలయం- 1. పంచాయతీ కార్యదర్శి, 2. డిజిటల్ అసిస్టెంట్ 3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీస్.
బి.వార్డు సచివాలయం- 1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, 2. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ. 3. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీస్.
3. సీ కేటగిరీ (3,501 కంటే ఎక్కువగా జనాభా:
ఏ. గ్రామ సచివాలయం- 1. పంచాయతీ కార్యదర్శి, 2. డిజిటల్ అసిస్టెంట్ 3, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, 4. మహిళా పోలీస్.
బి.వార్డు సచివాలయం- 1. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, 2. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ. 3. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, 4. మహిళా పోలీస్.
Read more:Visakhapatnam:శారదా పీఠానికి దారేది