Andhra Pradesh: 2024 ఎన్నికల టైమ్ లో వైసీపీ ప్రచారంలో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బొమ్మలు తయారు చేయించి, వాటిని జనంతో కొట్టించేలా, కొట్టి వారు ఆనందించేలా చేశారు. ఆ ముగ్గురి బొమ్మలతో రకరకాల ప్రచారాలు చేశారు. జనం ఇలాంటి జిమ్మిక్కులకు ఆకర్షితులయ్యారా, అసలు అలాంటి ప్రచారాన్ని నమ్మారా అనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.
మళ్లీ వైసీపీ అదే..గోల
తిరుపతి ఏప్రిల్ 8
2024 ఎన్నికల టైమ్ లో వైసీపీ ప్రచారంలో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బొమ్మలు తయారు చేయించి, వాటిని జనంతో కొట్టించేలా, కొట్టి వారు ఆనందించేలా చేశారు. ఆ ముగ్గురి బొమ్మలతో రకరకాల ప్రచారాలు చేశారు. జనం ఇలాంటి జిమ్మిక్కులకు ఆకర్షితులయ్యారా, అసలు అలాంటి ప్రచారాన్ని నమ్మారా అనేది ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఫలితాలు తేడాగా వచ్చినా వైసీపీలో మార్పు రాలేదనడానికి తాజా ఉదాహరణలే నిదర్శనం.వైసీపీ మారలేదు, మారాలనుకోవట్లేదు. తాజాగా తిరుపతిలో వైసీపీ వాళ్లు ఓ వీధినాటకం వేశారు. ఆ పార్టీ యువనేత భూమన అభినయ్ రెడ్డి దీనికి కర్త, కర్మ, క్రియ. చంద్రబాబు, లోకేష్, పవన్ పాత్రలను సృష్టించి జూనియర్ ఆర్టిస్టులతో ఓ షో చేశారు. దీనికి వైసీపీ సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు. ఇలాంటివాటిని జనం ఆసక్తిగా చూస్తారేమో కానీ, దీనివల్ల పార్టీకి ఏమేరకు ప్రయోజనం ఉంటుందనేది వైసీపీ నేతలు ఆలోచించుకోవాలి.
కూటమి ప్రభుత్వంలో పెరిగిన విద్యుత్ ధరలపై వీధినాటక ప్రదర్శన అనే పేరుతో స్కిట్లు వేశారు. విద్యుత్ దోపిడీకి గుణపాఠం చెబుతామంటూ దాదాపు ఓ 20మంది జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చారు. వీరిలో ముగ్గురికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పాత్రలు ఇచ్చారు. మిగతా వారు సామాన్య ప్రజలుగా నటించారు. చివరిగా కూటమి ప్రభుత్వం తమ హామీలు అమలుచేయలేదని, కరెంటు చార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ తీర్మానించారు. అంతే కాదు 2029లో వైసీపీదే ఘన విజయం అని ప్రకటించారు. 2029లో వైసీపీ గెలిచి, జగన్ సీఎం అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా చూపించారు.గతంలో కూడా భూమన అభినయ్ రెడ్డి వీధి నాటకాలతో తిరుపతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం లేదంటూ ఆయన కొంతమంది మహిళలను తీసుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కారు.
టికెట్ అడిగిన కండక్టర్ కి గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలను సెల్ ఫోన్లలో చూపించారు. ఈ నిరసన ప్రదర్శనకు జనం ఆకర్షితులయ్యారే కానీ, దానివల్ల వైసీపీకి కలిగిన ప్రయోజనం ఏంటనేది తేలడంలేదు. మరి జగన్ చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు హామీల గురించి అభినయ్ రెడ్డి సమాధానం చెప్పగలరా..? ఆ ప్రశ్నలకు మాత్రం బదులు లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. అప్పుడే ఇలా వీధి నాటకాలంటూ వారిని టార్గెట్ చేయడాన్ని ప్రజలు ఏమేరకు హర్షిస్తారో చూడాలి.ఇలాంటి జిమ్మిక్కులతోనే వైసీపీ మోసపోయింది. సిద్ధం సభలకు భారీగా జనం వచ్చారని చెప్పుకున్నారు, సభలకోసం జనం వెళ్లే సమయంలో ఐప్యాక్ టీమ్ కొంతమంది ప్రజల్ని ముందుగానే సిద్ధం చేసి కొంత డ్రామా నడిపిందనే ప్రచారం కూడా ఉంది. సామాన్యుల లాగా వారు జగన్ ని కలవాలని ఆరాటపడటం, వారిని చూసి సడన్ గా జగన్ బస్సుని ఆపడం.. ఇలాంటి వాటిని ప్రజలు ఏమాత్రం నమ్మలేదు. నమ్మలేదనడానికి సాక్ష్యం ఎన్నికల ఫలితాలే. ఇప్పుడు కూడా అలాంటి జిమ్మిక్కులపైనే వైసీపీ ఆధారపడటం విశేషం.
Read more:Andhra Pradesh: నెట్‌వర్క్ ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్