Andhra Pradesh: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా పడకేశాయి. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.3500కోట్లకు చేరడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల సంఘం ఆశా ప్రకటించింది. ఆరోగ్య శ్రీ బకాయిల విడుదల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 26సార్లు లేఖలు రాసినట్టు ఆస్పత్రుల సంఘం చెబుతోంది.ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్టు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది.
నెట్‌వర్క్ ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
విజయవాడ, ఏప్రిల్ 8
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు పూర్తిగా పడకేశాయి. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.3500కోట్లకు చేరడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల సంఘం ఆశా ప్రకటించింది. ఆరోగ్య శ్రీ బకాయిల విడుదల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 26సార్లు లేఖలు రాసినట్టు ఆస్పత్రుల సంఘం చెబుతోంది.ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సేవల్ని నిలిపి వేస్తున్నట్టు ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం – ఆశా గతనెలలోనే సమ్మె నోటీస్ ఇచ్చింది.కనీసం రూ.1500కోట్లు విడుదల చేస్తే కానీ సేవలు అందించలేమని తేల్చి చెప్పింది. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న బకాయిలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందించిన సేవలకు రూ. 3500 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. ఇప్పటి వరకు 26 సార్లు ప్రభుత్వానికి నిధుల విడుదల కోసం లేఖలు రాసినట్టు ఆస్పత్రుల సంఘం చెబుతోంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ స్థానంలో బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించే చికిత్సలకు ధరలు తక్కువగా ఉన్నాయని ఆస్పత్రులు అభ్యంతరం చెబుతున్నాయి.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 6 నుంచి దశల వారీగా చికిత్సలు నిలిపివేస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రల్లో ఆరోగ్య శ్రీ ఓపీలు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సేవల్ని నిలిపివేశారు. దాదాపు మూడు నెలలుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అరకొరగా సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవల్ని ట్రస్టు ద్వారా కాకుండా బీమా కంపెనీల భాగస్వామ్యంలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద అన్ని రకాల చికి త్సలు నిలిపివేస్తామని ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సీఈవో రవి, అడిషనల్ సీఈవో న్ ప్రసాద్‌బాబు, ఇతర అధికారులు.. ఆషా అధ్యక్షుడు డా. విజయ్ కుమార్, కార్యదర్శి అవినాశ్ ఇతర ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.బిల్లులను త్వరితగతిన చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్రస్టు ప్రతినిధులు ఆస్పత్రుల యాజమాన్యాలకు వివరించారు. తాము ప్రభుత్వానికి ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లేకపోవడంతో విధిలేక సేవలను నిలిపి వేస్తున్నట్టు ఆషా కార్యదర్శి అవినాశ్ వివరించారు. తాము గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆశా తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిలు కంటే నెట్వర్క్ ఆస్పత్రులు అందిం చిన వైద్య సేవల విలువ ఎక్కువగా ఉందని తెలిపింది. గతేడాది ఏప్రిల్లో చేసిన వైద్య సేవలకు ఇంత వరకూ పూర్తి చెల్లింపులు జరగలేదని పేర్కొంది.
Read more:Andhra Pradesh:సంక్షిప్త వార్తలు