Andhra Pradesh:ఏపీకి వచ్చేస్తున్న ఫ్రీ బస్సులు

Free buses coming to AP

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ త్తు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలసింది. అందుకోసమే అంతా సిద్ధం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సిద్ధమయ్యారు.

ఏపీకి వచ్చేస్తున్న ఫ్రీ బస్సులు

విజయవాడ, ఏప్రిల్ 15
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. ఆర్టీసీపై భారం పడకుండా ఎలక్ట్రికల్ త్తు బస్సులను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తుంది. అయితే ఈ పథకం త్వరలోనే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలసింది. అందుకోసమే అంతా సిద్ధం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించి ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి దశలో కొన్ని బస్సులను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన నగరాలకు, పట్టణాలకు పంపుతూనిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకం పై వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆర్టీసీపై భారం పడకుండా ఉండేందుకు కొన్నిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మహిళల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని అమలుచేయాలని భావిస్తూ ఎలక్ట్రికల్ బస్సులను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

దీనివల్ల ఉచిత ప్రయాణం పెద్దగా ఖర్చు లేకుండానే, భారం ఆర్టీసీపైనా, ప్రభుత్వంపైన పడకుండానే నామమాత్రంగా వ్యయంఅవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తుంది. నగరాలకు కేటాయించి… అందులోనూ కొన్ని నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తీసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎక్కువగా సిటీ బస్సుల్లో ఎక్కువ మంది ఉచితంగా నిత్యం తిరిగే అవకాశముందని భావించిన ప్రభుత్వం మొదటి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇందులో వంద బస్సులు విశాఖపట్నానికి కేటాయించారు. మరో వంద బస్సులు విజయవాడకు ఇచ్చారు. గుంటూరుకు వంద, నెల్లూరుకు వంద, కర్నూలుకు యాభై బస్సులతో పాటు కాకినాడ, రాజమండ్రి, కడప మరియు అనంతపురం డిపోలకు 50 బస్సులు కేటాయించనున్నారు. తిరుపతితో పాటుమంగళగిరి డిపోలకు 50 బస్సులు కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లు సంబంధిత డిపోలలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నచో్ట ఈ బస్సుల కేటాయింపు చేస్తూ భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

Read more:Andhra Pradesh:సజ్జల హవానేనా.

 

Related posts

Leave a Comment