Andhra Pradesh:వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కోల్పోయినా ఆయనలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎంత మంది పార్టీ నేతలు వెళ్లింది కారణాలు ఎవరని చెప్పిందీ అందరికీ తెలుసు. అందరి వేళ్లూ చూపించిన వారినే అందలం ఎక్కించుకంటుంటే ఇక జగన్ వైఖరిలో ఏం మార్పు వచ్చినట్లు? సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి ముఖ్యమైన నిర్ణయాల వరకూ.. ఐదేళ్లలో అన్ని శాఖలపై పెత్తనం వెలగబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డికి మరోసారి జగన్ కీలక పదవి కట్టబెట్టడం పార్టీలోనే చర్చనీయాంశమైంది.
సజ్జల హవానేనా.
విజయవాడ, ఏప్రిల్ 15
వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కోల్పోయినా ఆయనలో మార్పు రాలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఎంత మంది పార్టీ నేతలు వెళ్లింది కారణాలు ఎవరని చెప్పిందీ అందరికీ తెలుసు. అందరి వేళ్లూ చూపించిన వారినే అందలం ఎక్కించుకంటుంటే ఇక జగన్ వైఖరిలో ఏం మార్పు వచ్చినట్లు? సీట్ల కేటాయింపుల దగ్గర నుంచి ముఖ్యమైన నిర్ణయాల వరకూ.. ఐదేళ్లలో అన్ని శాఖలపై పెత్తనం వెలగబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డికి మరోసారి జగన్ కీలక పదవి కట్టబెట్టడం పార్టీలోనే చర్చనీయాంశమైంది. సజ్జల రామకృష్ణారెడ్డిని పీఏసీ కన్వీనర్ గా నియమించడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అంటూ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టులు కనపడుతున్నాయి.. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు వివాదాలకు నిలయంగా మారింది. నాటి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే అది రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకోవచ్చు. కానీ పార్టీని వీడి వెళ్లిపోతున్న నేతలందరూ సజ్జల వైపు చూపుతున్నారు. చివరకు జగన్ కు కష్టకాలంలో అండగా ఉండి ఆయనతో పాటు జైలుకు వెళ్లి పదహారు నెలలు గడిపి వచ్చిన విజయసాయిరెడ్డి కూడా కోటరీ అంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపారు.
అంటే ఆయనపై పార్టీలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ నుంచి వెళ్లి పోయేవారు సజ్జల ను కార్నర్ చేస్తున్నారని జగన్ భావిస్తే అంతకంటే మించిన కామెడీ మరొకటి ఉండదు. ఎందుకంటే జగన్ కు తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక పనులు ఐదేళ్లలో చక్కపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమైన పదవుల నియామకం నుంచి పార్టీ ఇన్ ఛార్జుల మార్పు వరకూ అంతా సజ్జల చెప్పినట్లే జరిగిందంటారు. జగన్ వద్దకు కనీసం వెళ్లేందుకు కూడా సజ్జల అంగీకరించేవారు కాదు. అంతా తన వద్దనే సర్దుబాటు చేసి మంత్రులను, ఎమ్మెల్యేలను పంపేవారు. జగన్ తనకు చెప్పారంటూ నేతలకు చెబుతుండటంతో అది నిజమేనని నమ్మిన నేతలు మౌనంగానే వెనక్కు వెళ్లిపోయేవారు. అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి తీసుకెళ్లకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకున్నాన్న విమర్శలు కూడా ఫ్యాన్ పార్టీలో వినిపించాయి.
అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గత ఎనిమిది నెలలుగా కొంత దూరంగా ఉంటున్నారు. అయితే జగన్ కూడా ఆయనను దూరం పెట్టారులే అని అందరూ అనుకున్నారు. కానీ పీఏసీ కమిటీ కన్వీనర్ గా నియమించడంతో జగన్ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఏమాత్రం తగ్గలేదన్నది మరోసారి స్పష్టమయింది. సజ్జల వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా, నష్టమేనని అందరూ చెబుతున్నప్పటికీ జగన్ మాత్రం మొండిగా వ్యవహరించడం పట్ల వైసీపీ సీనియర్ నేతలు సయితం ఒకింత ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో ఉన్న పరిస్థితులు వైసీపీలో ఏం మారలేదనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి నియామకమే నిదర్శనమని అంటున్నారు. మరి సజ్జల వల్ల ఉపయోగం జగన్ కు మాత్రమే తెలుసా? ఆయన వైఖరిలో మార్పు రాదన్నది ఈ నియామకంతో వెల్లడయింది.
మండిపడుతున్న సీనియర్లు
నమ్మకం.. ఈ మాట ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. నమ్మకం ఉండాలి తప్ప.. అదే నమ్మకాన్ని గుడ్డిగా ఫాలో కాకూడదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోంది అదే. ఏకంగా పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పెట్టేశారు. తాను పార్టీ అధినేతగా కొనసాగుతుండగా.. పార్టీలో అత్యంత విలువైన రాజకీయ వేదికగా ఉన్న పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సజ్జల వారిని చైర్మన్ చేశారు. అంటే తన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని అంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే సజ్జల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నది మెజారిటీ నేతల అభిప్రాయం. కానీ జగన్మోహన్ రెడ్డి దానిని విశ్వసించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి పై నమ్మకం పెట్టుకొని ఏకంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండేవారు.
అటువంటి వ్యక్తిని తెచ్చి పార్టీ కార్యక్రమాలను అప్పగించారు. పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. చివరకు పార్టీలో కూడా విశేష హక్కులు కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి తో నడిచిన నేతలకు ఇది మింగుడు పడని విషయం. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్లు సజ్జల విషయంలో భిన్నభిప్రాయాలతో ఉన్నారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని సజ్జలను తమపై రుద్దడాన్ని ఎక్కువమంది వ్యతిరేకిస్తున్నారు. గత ఐదేళ్ల వైసిపి అధికారంలో ఉండేటప్పుడు ఏ నిర్ణయం అయినా చెల్లి పోయింది. కానీ ఇప్పుడు సజ్జలను తమపై వేయడం ఏమిటన్న అభిప్రాయం సీనియర్లలో ఉంది.తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో ఉంది. దానిలో దాదాపు 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. దానికి అధ్యక్ష పదవి అంటూ లేదు. పార్టీ అధినేత చంద్రబాబు.. పొలిట్ బ్యూరో సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
ఆయన మార్గదర్శకంలోనే అత్యున్నత సమావేశంలో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ లో అందుకు భిన్నం జరుగుతోంది. ఏకంగా ఆ కమిటీ అధ్యక్ష బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు జగన్. ఇది ఎంత మాత్రం వైసీపీ సీనియర్లకు రుచించడం లేదు. సజ్జల తీరు వల్లే పార్టీ ఓడిపోయింది అన్నది ఎక్కువమంది అభిప్రాయం. అటువంటి వారంతా ఇప్పుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వం పై పెత్తనం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కుమారుడు భార్గవరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని చూసేవారు. ఈ ఇద్దరు తండ్రి కుమారులు ఆర్థికంగా బలపడ్డారు. కానీ పార్టీకి మైనస్ చేశారు అన్నది సీనియర్ నేతల అభిప్రాయం. అందుకే సీనియర్లు సజ్జల తాజా నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎవరి తీరుతో ఓటమి చెందామో.. అటువంటి వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల నియామకం వివాదానికి దారి తీసినట్టు ఉంది.
Read more:HCA vs SRH Dispute.. What Happened | Sunrisers Hyderabad | Hyderabad Cricket Association | BCCI |