Andhra Pradesh:ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం పాటు పడేందుకే వస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదన్నారు.మాజీ సీఎం జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు అస్సలు లేవన్నది ఆయన మాట.
రాజకీయాల్లోకి ఏబీవీ.
రాజమండ్రి, ఏప్రిల్ 14
ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని, అందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. మెరుగైన సమాజం కోసం పాటు పడేందుకే వస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ పదవులు ఆశించి మాత్రం కాదన్నారు.మాజీ సీఎం జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలు, వ్యక్తిగత కక్షలు అస్సలు లేవన్నది ఆయన మాట. జగన్ అక్రమాలను కచ్చితంగా బయటకు తెస్తానని కుండబద్దలు కొట్టేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోడికత్తి శ్రీను కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఐపీఎస్ అధికారి మాట్లాడారు. ఊహించలేని విధంగా విధ్వంసం జరిగిందన్నారు. గడిచిన ఐదేళ్లు ఊహించని డ్యామేజ్ జరిగిందన్నారు.జగన్ పార్టీ, పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం,అణిచివేత పునాదులపై నిర్మించారన్నారు. రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డు వచ్చినవారిని అణిచివేయడమేన్నారు. ప్రజల గురించి ఆయనకు ఏమాత్రం పట్టలేదన్నారు. వయస్సు వచ్చిన దగ్గర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వరకు ఆయన చేసిన పనులన్నీ ఇవేనన్నారు.ఆయనలాంటి మనసత్వం ఉన్నవారిని, సభ్యత సంస్కారం లేని వారిని పెంచి పోషిస్తారని, అలాంటి వారికే ప్రమోషన్లు సైతం ఇస్తున్నారని అన్నారు.
ప్రతిపక్ష నేతలు ఇళ్లు, ఆఫీసులపై దాడి చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ ఆయన ఇస్తారని గుర్తు చేశారు. ప్రజాలను కుల, మత వర్గాలుగా విభజించి తన దోపిడీని సాగించాలనే ఆలోచనున్న వ్యక్తిని అన్నారు. ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు వెళ్తుందో ఊహించలేమన్నారు.జగన్ అధికారంలోకి రాకముందు బలైన వ్యక్తి కోడి కత్తి శ్రీను అని చెప్పారు ఏబీవీ. దళిత యువకుడి జీవితాన్ని చిదిమేసిన వ్యక్తి జగన అని అన్నారు. ఆ కేసుకు సంబంధించి ముఖ్యమైన పత్రాలు ఆయన మీడియాకు అందజేశారు. కోడికత్తి శ్రీను వ్యవహారం మాత్రమే కాదని, ఎన్నో విషయాల్లో ఆయన స్వభావం బయటపెట్టుకున్నారని వివరించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు, మీడియా ముందు చెబుతానని వెల్లడించారు. ఆయన మాటల వ్యవహారశైలిని గమనించినవాళ్లు మాత్రం అయితే జనసేన, లేకుంటే బీజేపీలో చేరడం ఖాయమని అంటున్నారు.2014-19 మధ్యకాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహారించారు ఏబీ వెంకటేశ్వరరావు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసింది. గడిచిన ఐదేళ్లు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేశారు ఆయన. పదవీ విరమణకు ముందు ఉదయం డ్యూటీలో జాయిన్ అయి సాయంత్రం రిటైర్ తీసుకున్నారు.
Read more:సంక్షిప్త వార్తలు:04-13-2025