Andhra Pradesh:మంత్రుల పేషీలపై అవే కళ్లు వారిని వదిలించుకోవాలని వార్నింగ్

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu keeps an eye on the ministers' muscles

Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పేషీలపై ఒక కన్నేసి ఉంచారు. నిరంతరం నిఘా పెట్టారు. మంత్రుల పేషీల్లోని ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వారిపై చర్యలకు దిగుతున్నారు. నేరుగా ఆయన రంగంలోకి దిగి వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై అవినీతి అరోపణలు రావడంతో అతనిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రుల పేషీలపై అవే కళ్లు
వారిని వదిలించుకోవాలని వార్నింగ్

విజయవాడ, ఏప్రిల్ 14
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పేషీలపై ఒక కన్నేసి ఉంచారు. నిరంతరం నిఘా పెట్టారు. మంత్రుల పేషీల్లోని ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వారిపై చర్యలకు దిగుతున్నారు. నేరుగా ఆయన రంగంలోకి దిగి వారిని తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై అవినీతి అరోపణలు రావడంతో అతనిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటలిజెన్స్ నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ మంత్రుల పేషీల్లో ఏమాత్రం అవినీతి జరుగుతున్నప్పటికీ వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అవినీతిని సహించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని చంద్రబాబు తరుచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అధికారిక వర్గాల్లో అవినీతి జాడ్యం అధికంగా ఉందని, వైసీపీ హయాంలో ఈ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మారాలన్నారు. అయినా, కొంతమంది అధికారులు మారినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.కొంతమంది మంత్రుల ఓఎస్డీ, పీఎస్ , పీఏలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే మంగళవారం ఏపీ కేబినేట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మంత్రుల పేషిలో కొనసాగుతున్న అవినీతి వ్యవహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.ముఖ్యమంత్రి హెచ్చరించినా కొంతమంది మంత్రుల సిబ్బంది ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడంతో అతని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ హోంమంత్రి అనిత పీఏపై ఫిర్యాదులు రాగానే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. మరికొంతమంది మంత్రుల సిబ్బందిపై ఆరోపణలు వస్తుండటంతో కేబినేట్ భేటీ సందర్భంగా సిబ్బందిపై నిఘా ఉంచడం, అవినీతిని అరికట్టే చర్యలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.కొందరు మంత్రులు హెచ్చరించినా వినకపోవడంతో వారిపై నేరుగా చర్యలకు దిగుతున్నారు.గతంలోనూ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏపై ఫిర్యాదులు రావడంతో వెంటనే విధుల నుంచి తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇంకా అనేక మంది మంత్రుల పేషీల్లో ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న నిఘా సంస్థల నివేదికలతో చంద్రబాబు నాయుడు మంత్రులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గుడ్డిగా వారిని నమ్మవద్దని, వారిపై ఒక కన్నేసి ఉంచాలని చెబుతున్నప్పటికీ వారిపై ఎక్కువగా ఆధారపడుతున్న మంత్రుల పేషీల్లోనే ఈ రకమైన తతంగం జరుగుతుందని గుర్తించారు. దీంతో మంత్రులకు తెలియకుండానే వారి పేషీల్లోని సిబ్బందిని తొలగిస్తున్నట్లు జీఏడీ నుంచి ఆదేశాలు అందతుండం విశేషం.ఈ విషయంపై మంగళవారం జరిగే మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మరోసారి మంత్రులకు క్లాస్ పీకే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులు కేవలం తమ శాఖపైన దృష్టి పెట్టడమే కాకుండా తన పేషీలో ఏ: జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్తగా లేకపోతే వారు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారని చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లో గట్టిగా చెప్పనున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదికలను కూడా మంత్రుల ముందు ఉంచనున్నారు. ఇలా ఉపేక్షించుకుంటూ వెళితే మంత్రులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న హెచ్చరికలు చంద్రబాబు జారీ చేయనున్నారు. దీంతో ఏ మంత్రులకు క్లాస్ పీకుతారన్నది ఉత్కంఠగా మారింది.

Read more:Andhra Pradesh:మళ్లీ కీలకంగా సజ్జల

Related posts

Leave a Comment